MI 7 Closing Collections ప్రపంచవ్యాప్తంగా 3100 కోట్ల కలెక్షన్లు.. టామ్ క్రూజ్ మూవీకి ఇండియాలో ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించి, నిర్మించిన మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను ముగించబోతున్నది. గత రెండు వారాలుగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్నీ కేంద్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేసింది. జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టోరి బ్యాక్ డ్రాప్‌గా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తెరకెక్కింది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో తాజాగా రూపొందించిన డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ ఏడోది. మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఏడో సిరీస్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ గా విడుదల చేశారు. ఈ సినిమాకు టామ్ క్రూజ్, దర్శకుడు క్రిస్టఫర్ నిర్మాతలుగా వ్యవహరించడం గమనార్హం.

మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రం తొలి రోజు భారీ ఓపెన్సింగ్స్ సాధించింది. తొలి రోజు 12 కోట్లకుపైగా వసూళ్లతో కలెక్షన్ల యాత్రను మొదలుపెట్టింది. తొలివారం వారం లాంగ్ వీకెండ్ కావడంతో మొత్తం 9 రోజులతో తొలివారం కలెక్షన్లను ముగించింది.
ఇండియాలో మిషన్ ఇంపాజిబుల్ తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ వెర్షన్ 52.1 కోట్లు హిందీ వసూళ్లు 25.55 కోట్లు, తమిళ వెర్షన్ 1.5 కోట్లు, తెలుగు వెర్షన్ 1.45 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో 80.6 కోట్ల కోట్ల రూపాయాలను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ఇక రెండోవారం ముగిసే సమయానికి 100 కోట్ల రూపాయల మైలురాయిని అధిగమిచింది. ఈ చిత్రం 1113.50 కోట్ల రూపాయలను నమోదు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్ దాదాపు 70 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు అంతంత మాత్రంగానే కలెక్షన్లను నమోదు చేశాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 3100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇండియాలో 113 కోట్లకుపైగా, మిగితా దేశాలతో కలిపి ఈ సినిమా 2100 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











