Mission Impossible 8 Day 3 Collection: టామ్ క్రూజ్ బాక్సాఫీస్ సంచలనం..మిషన్ ఇంపాజిబుల్ 8 కలెక్షన్లు ఇవే

ప్రపంచ సినిమా రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఫ్రాంచైజీలో మిషన్: ఇంపాసిబుల్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్‌లో భాగంగా ఇటీవల విడుదలైన 8వ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్. ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ వన్ మూవీ 2023 సంవత్సరంలో రిలీజైంది. దానికి రెండో పార్ట్‌గా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17 తేదీన ఇండియాలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా అమెరికా, ఇతర దేశాల్లో మే 23వ తేదీన విడుదల కానున్నది. ఈ సినిమా ఇండియా కలెక్షన్లు, ఈ మూవీ బడ్జెట్ వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రంలో హేలీ ఎట్‌వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఇసాయి మోరేల్స్, పామ్ క్లెమెంటీఫ్, హెన్నీ జార్నీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి క్రిస్టఫర్ మాక్క్వెరీ దర్వకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ప్రపంచంలోని పలు దేశాల్లో అందమైన పర్వత ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాను సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 2570 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Mission Impossible The Final Reckoning

మిషన్ ఇంపాసిబుల్ సినిమాకు తొలి రోజు ఇండియాలో వివిధ భాషల్లో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ 11 కోట్ల రూపాయలు, హిందీలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు, కన్నడలో 2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 18.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కాలంలో అంటే 2025 సంవత్సరంలో ఏ హాలీవుడ్ సినిమా సాధించనటువంటి ఓపెనింగ్స్‌ను ఈ చిత్రం రాబట్టింది.

ఇక మిషన్ ఇంపాసిబుల్ 8 సిరీస్‌కు రెండో రోజ కూడా ఇండియాలో రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా శనివారం రిలీజ్ కావడంతో ఆదివారం కూడా అదే జోరు, జోష్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఈ సినిమా రెండో రోజున ఇంగ్లీష్ వెర్షన్ 11 కోట్ల రూపాయలు, హిందీలో 5.5 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 50 లక్షల రూపాయలు, కన్నడలో 2.5 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమాకు 3వ రోజు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌గానే స్పందన వ్యక్తమైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 50 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఈ మూవీ సోమవారం రోజున నిలకడగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మూడో రోజున 5 నుంచి 7 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మిషన్ ఇంపాసిబుల్ 8 సినిమా నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమా యూఎస్‌లో మే 23వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 38.5 కోట్ల రూపాయలు నెట్, 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం గల్ఫ్, ఇతర ప్రాంతాల్లో మొత్తంగా 175 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

FAQs
2025 సంవత్సరంలో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన మూవీ ఏంటి?

ఏ మైన్ క్రాఫ్ట్ (910 మిలియన్ డాలర్లు), కెప్టెన్ అమెరికా (415 మిలియన్ డాలర్లు), థండర్ బోల్ట్స్ (278 మిలియన్ డాలర్లు)

ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు రాబట్టింది?

అమెరికాలో 409 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌లో 501 మిలియన్ డాలర్లు

కెప్టెన్ అమెరికా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు రాబట్టింది?

అమెరికాలో 415 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌లో 200 మిలియన్ డాలర్లు

థండర్‌బోల్డ్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు రాబట్టింది?

అమెరికాలో 278 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్ లో 134 మిలియన్ డాలర్లు

Filmibeat Entertainment

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X