Mission Impossible 8 Box Office: మిషన్ ఇంపాసిబుల్ 2570 కోట్ల బడ్జెట్.. ఇండియాలో టామ్ క్రూజ్ మూవీకి కలెక్షన్లు
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఫ్రాంచైజీలో మిషన్: ఇంపాసిబుల్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్‌లో భాగంగా ఇటీవల విడుదలైన 8వ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్. ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ వన్ మూవీ 2023 సంవత్సరంలో రిలీజైంది. దానికి రెండో పార్ట్‌గా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17 తేదీన ఇండియాలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా అమెరికా, ఇతర దేశాల్లో మే 23వ తేదీన విడుదల కానున్నది. ఈ సినిమా ఇండియా కలెక్షన్లు, ఈ మూవీ బడ్జెట్ వివరాల్లోకి వెళితే..
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రంలో హేలీ ఎట్‌వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, ఇసాయి మోరేల్స్, పామ్ క్లెమెంటీఫ్, హెన్నీ జార్నీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి క్రిస్టఫర్ మాక్క్వెరీ దర్వకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ప్రపంచంలోని పలు దేశాల్లో అందమైన పర్వత ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాను సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 2570 కోట్ల రూపాయలతో నిర్మించారు.

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ సినిమాకు ఇండియాలో భారీ ఆదరణ కనిపించింది. శనివారం రోజున రిలీజైన ఈ సినిమాకు వీకెండ్ కావడంతో ప్రేక్షకులు పోటెత్తారు. ఈ సినిమాకు మార్నింగ్ షోకు 75 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 80 శాతం, ఫస్ట్ షోకు 85 శాతం, సెకండ్ షోలకు 85 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు, సాక్ నిల్క్ వెల్లడించింది.
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ సినిమాకు ఇండియాలో మిక్స్‌డ్ రెస్సాన్ వస్తున్నది. ఈ సినిమాపై అంచనాలు పెంచుకొన్న వారు కొంత అసంతృప్తికి గురైతే.. క్రూజ్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. అయితే లాంగ్ రన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, ఆహ్మదాబాద్, చెన్నై, కోచి తదితర నగరాల్లో ఈ సినిమాకు 60 నుంచి 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ 7 సినిమా తొలి రోజు సుమారుగా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిషన్ ఇంపాసిబుల్ 8 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇండియాలో 22 నుంచి 25 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఇక అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా 23వ తేదీన రిలీజ్ కానున్నది. ఇప్పటికే ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుంది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో తొలి రోజు 600 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











