బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న మిషన్ మంగళ్.. ఊహించని కలెక్షన్లతో దూకుడు

బాలీవుడ్‌లో విభిన్న సినిమాలకు, విలక్షణమైన నటనకు పట్టం కడుతున్నారని తాజాగా నిరూపించిన చిత్రం మిషన్ మంగళ్. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. అంతరిక్ష పరిశోధన నేపథ్యంగా మంగళ్‌యాన్ (మామ్) ప్రయోగం బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, కృతి కుల్హారీ, నిత్యా మీనన్, శర్మాన్ జోషి తదితరులు నటించిన ఈ చిత్రం గత 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

టాప్ 5 చిత్రాల జాబితాలో

టాప్ 5 చిత్రాల జాబితాలో

ఇస్రో 50 ఏళ్లు పూర్తి చేసుకొంటున్న శుభ సమయంలో మిషన్ మంగళ్ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో మొదటి రోజు నుంచి ఊహించని కలెక్షన్లు వెల్లువెత్తాయి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ చిత్రంగా బరిలో నిలిచింది. 2019లో విడుదలైన చిత్రాల్లో టాప్ 5 జాబితాలో చోటు సంపాదించింది.

8 రోజుల కలెక్షన్లు ఇవే

8 రోజుల కలెక్షన్లు ఇవే

మిషన్ మంగళ్ చిత్రం తొలి రోజు (గురువారం)న 29.16 కోట్లు, శుక్రవారం 17.26 కోట్లు, శనివారం రూ.23.58 కోట్లు, ఆదివారం రూ.27.54 కోట్ల వసూలు చేసింది. తొలివారాంతంలోనే రూ.100 కోట్లకు చేరువైంది. తొలివారాంతం తర్వాత కూడా అదే ఊపును కొనసాగించింది. ఇక సినిమాలకు లిట్మస్ టెస్ట్‌గా పరిగణించే సోమవారం రోజున ఈ చిత్రం స్టడీగా నిలబడింది. సోమవారం రూ.8.91 కోట్లు, మంగళవారం రూ.7.92 కోట్లు, బుధవారం రూ.6.84 కోట్లు, గురువారం రూ.6.93 కోట్లు వసూలు చేసింది.

100 కోట్ల క్లబ్‌ను దాటేసి

100 కోట్ల క్లబ్‌ను దాటేసి

గత పదిరోజుల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ్యక్తం కావడంతో మంగళ్ మిషన్ సునాయాసంగా రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసింది. గత ఎనిమిది రోజుల్లో రూ.128 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ భారీ చిత్రాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రానున్న రోజుల్లో రూ.150 కోట్ల క్లబ్‌ను కూడా అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మిషన్ మంగళ్‌తోపాటు బాట్లా హౌస్

మిషన్ మంగళ్‌తోపాటు బాట్లా హౌస్

మిషన్ మంగళ్‌ చిత్రంతోపాటు ఢిల్లీలో జరిగిన టెర్రరిస్టు దాడి నేపథ్యంగా రూపొందిన బాట్లా హౌస్‌ కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని సినీ హీరో జాన్ అబ్రహం రూపొందించారు. బాట్లా హౌస్‌ కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. తొలి రోజున రూ.14.50 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజున రూ.9 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది. చిన్న చిత్రంగా వచ్చిన బాట్లా హౌస్‌ చిత్రం 50 కోట్ల క్లబ్‌ను దాటేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X