బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న మిషన్ మంగళ్.. అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే..

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, విద్యా బాలన్, తాప్సీ పన్ను, శర్మాన్ జోషి తదితరులు నటించిన మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. భారతీయ అంతరిక్ష పరిశోధనల ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు పెంచిన మంగళ్ యాన్ లేదా మామ్ ప్రయోగం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. మామ్ ప్రయోగం వెనుక ఐదుగురు మహిళ కృషిని ప్రధానంగా హైలెట్ చేస్తూ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించడం ఈ సినిమా కథలో విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండిస్తున్నది. జాన్ అబ్రహం రూపొందించిన బాట్లా హౌస్ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. గత రెండు రోజులుగా ఈ రెండు చిత్రాలు ఎంత కలెక్ట్ చేశాయంటే..

 3000 స్క్రీన్లలో మిషన్ మంగళ్

3000 స్క్రీన్లలో మిషన్ మంగళ్

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మిషన్ మంగళ్ చిత్రం అట్టహాసంగా రిలీజైంది. దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మొదటి రోజు 55 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకొన్నది. దాంతో తొలి రోజు 23.67 కోట్ల వసూళ్లను సాధించింది. అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్‌గా ఓ రికార్డు సొంతం చేసుకొన్నది.

50 కోట్లకు చేరువగా

50 కోట్లకు చేరువగా

ఇక రెండో రోజు కూడా మిషన్ మంగళ్ చిత్ర కలెక్షన్ల హవా కొనసాగింది. వర్కింగ్ డే రోజున రూ.25 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రానికి సంబంధించి రెండు రోజుల కలెక్షన్లు 46.44 కోట్లకు చేరుకొని 50 కోట్ల మైలురాయికి చేరువైంది. ఆదివారం రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.

సల్మాన్ ఈద్.. అక్షయ్‌కు ఇండిపెండెన్స్ డే

సల్మాన్ ఈద్.. అక్షయ్‌కు ఇండిపెండెన్స్ డే

ఇక సల్మాన్ ఖాన్‌కు ఈద్ ఎంత ముఖ్యమో.. అక్షయ్ కుమార్ ఇండిపెండెన్స్ డే కలిసి వచ్చే రోజు. ప్రతీ ఇండిపెండెన్స్ డే రోజున అక్షయ్ కుమార్ తన సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో గోల్డ్ సినిమాను రిలీజ్ చేశారు. తాజాగా తన గత చిత్రాల ఓపెనింగ్ రికార్డులను మిషన్ మంగళ్ తిరగరాస్తున్నది.

బాట్లా హౌస్‌కు భారీ వసూళ్లు

బాట్లా హౌస్‌కు భారీ వసూళ్లు

ఇక ఢిల్లీలో జరిగిన టెర్రరిస్టు దాడి నేపథ్యంగా రూపొందిన బాట్లా హౌస్‌ను జాన్ అబ్రహం రూపొందించారు. బాట్లా హౌస్‌ కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. తొలి రోజున రూ.14.50 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజున రూ.9 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది. తొలి వారాంతానికి మిషన్ మంగళ్ చిత్రం రూ.85 కోట్లు, బాట్లా హౌస్‌ చిత్రం 50 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X