రికార్డులు బద్దలు కొడుతున్న ‘మిషన్ మంగళ్’.. మైలురాయికి చేరువ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం 'మిషన్ మంగళ్'. జగన్ శక్తి దీనిని తెరకెక్కించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ రాకేష్ ధావన్ అనే సైంటిస్ట్ పాత్రలో నటించాడు. ఈ మిషన్‌లో భాగస్వామ్యం ఉన్న ఇతర ముఖ్యపాత్రల్లో విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్, కీర్తి కుల్హరి నటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రుడి పైకి ఉపగ్రహాన్ని పంపించడానికి ఇస్రో చేసిన ప్రయోగమే మంగళ్‌యాన్. దీనిని ప్రధానాంశంగా తీసుకుని 'మిషన్ మంగళ్' తెరకెక్కింది. ఈ ప్రయోగం వెనుక జరిగిన కృషి, దానికి సహకరించిన ప్రధాన వ్యక్తులు తదితర అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. అందుకే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా మంచి టాక్‌ను సొతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తుంది.

 Mission Mangal Collections report

ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 97.16 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000 లోకేషన్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ. 29.16 కోట్లు రాబట్టుకోగలిగింది. అలాగే రెండో రోజు రూ. 17.28 కోట్లు, మూడో రోజు రూ. 23.58 కోట్లు, నాలుగో రోజు రూ. 27.54 కోట్లు సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలోనే వంద కోట్ల మైలురాయికి చేరువైంది. ఈ మేరకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ తరహా కలెక్షన్లు రాబట్టడం అక్షయ్ కుమార్ కెరీర్‌లో రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X