కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘మిషన్ మంగళ్’.. 200 కోట్లకు చేరువలో!

ఇటీవలే విడుదలైన 'మిషన్ మంగళ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల మార్కును దాటేసిన 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటి దాకా ఈ సినిమా 178.11 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ పేర్కొన్నాడు.

జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అక్షయ్ కుమార్‍‌తో పాటు విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, క్రితి కుల్హరి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి ముఖ్య పాత్రలు పోషించారు. ఇస్రో చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి గ్రహాంతర మిషన్ - మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్యాన్) స్పూర్తితో దీన్ని తెరకెక్కించారు. మంగళ్యాన్ విజయంతో మార్షియన్ కక్ష్యకు చేరుకున్న మొట్టమొదటి ఆసియా దేశంగా భారత్ అవతరించడమే కాక, మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించిన దేశంగా ప్రపంచకీర్తిని గడించింది.

 Mission Mangal Running towrds 200cr collections

ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 29.16 కోట్లు రాబట్టడంతో అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. మొదటి వారంలో 128.16 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో వారంలో 49.95 కోట్లు రాబట్టింది. మొత్తంగా చూస్తే 178.11 కోట్ల రూపాయలు వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X