Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాక్సాఫీసు వద్ద ‘మిస్టర్’ కలెక్షన్స్ పరిస్థితి ఇదీ...
వరుణ్ తేజ్ ‘మిస్టర్’ మూవీ తొలి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కలిపి తొలి రోజు రూ. 3.22 కోట్లు వసూలు చేసింది.
హైదరాబాద్: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటలే హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'మిస్టర్' మూవీ తొలి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కలిపి తొలి రోజు రూ. 3.22 కోట్లు వసూలు చేసింది.
మెగా ఫ్యామిలీ హీరో కావడం, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శ్రీను వైట్ల దర్శకత్వం కావడతో సినిమాపై ముందు నుండి అంచనాలు బావున్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం కూడా సినిమాపై హైప్ పెరగడానికి కారణమైంది.
డివైడ్ టాక్
అయితే సినిమా విడుదలైన తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. యావరేజ్ మూవీ అనే ముద్రపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా ఆశించిన వసూళ్లు సాధిస్తుందా? నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? అనేది చర్చనీయాంశం అయింది.
పరిస్థితులు అనుకూలం
అయితే బాక్సాఫీసు వద్ద ఇతర పెద్ద సినిమాల పోటీ ఏమీ లేక పోవడం, బాహుబలి 2 రిలీజ్ వరకు మరే ఇతర పెద్ద సినిమాల రిలీజ్ కూడా లేక పోవడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ప్రమోషన్స్
పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పెంచింది. వీలైనంత ఎక్కువ మందిని థియేటర్ల వద్దకు రప్పించే ప్రయత్నం చేస్తోంది.
శ్రీను వైట్ల
ఈ మధ్య వరుస ప్లాపులతో వెనక పడ్డ శ్రీను వైట్ల ఈ సినిమా ద్వారా హిట్ కొట్టి మళ్లీ స్పీడు పెంచుదామనుకున్నాడు. కానీ మిస్టర్ మూవీ శ్రీను వైట్లకు ఏ మాత్రం హెల్ప్ చేయలేకపోయింది.