'కొత్త బంగారు లోకం'ఏమయ్యింది?

అందులోనూ రాజు గారు ఎన్నడూ లేనిది రిలీజయి వారం కూడా కాకుండానే అప్పుడే మీడియా ముందు కొచ్చి సినిమా హిట్ అని ప్రెస్ మీట్ పెట్టడాన్ని అభద్రతా భావంగా చూపెడుతున్నారు. అయితే కలర్ ఫుల్ వాల్ పోస్టర్స్ ,బ్యానర్ వ్యాల్యూ, ఎఫ్.ఎమ్ లలో మారుమ్రోగుతున్న పాటలు, దసరా హ్యాలిడేస్ యూత్ కి థియోటర్ వరకూ లాగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని అంగీకరిస్తూ దిల్ రాజు గానే స్టేట్ మెంట్ ఇచ్చాడు.
పాతికేళ్ళు లోపు వారికి ప్రధమార్ధం బాగుందన్నారని,పాతిక నుంచి నలభై లోపు వారు యావరేజ్ రేంజ్ అంటున్నారని,నలభై దాటిన వారు సెకెండాఫ్ నచ్చిందంటున్నారని చెప్పుకొచ్చారు. అందులోనూ సినిమాలో రెండు తప్పులు దొర్లాయని...తర్వాత సినిమాల్లో వాటిని సవరించుకుంటానని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్ని వర్గాలనీ సంతృప్తి పరచాలి,బొమ్మరిల్లు చిత్రంలాగ ఫ్యామిలీలను ధియోటర్ కి లాగాలి,మరో చరిత్రలాగ సినిమాలా జనాల్ని ఆలోచనలో పడాయ్యాలి,చిత్రం ఫిల్మ్ లా యూత్ ని రెచ్చకొట్టాలనే అత్యాసే సినిమాని ఇలా దేనికీ చెందని దానిగా తయారుచేసిందని చూసిన సీనియర్స్ అంటున్నారు. నిజాయితీగా ప్రయత్నంచేసుంటే ఇలా జరిగిఉండేదికాదేమో...


Click it and Unblock the Notifications











