Empuraan Day 1 Collections : ఎంపురాన్ డే1 కలెక్షన్లు.. మోహన్ లాల్ బాక్సాఫీస్ జాతర.. ఎన్ని కోట్లంటే?
2019లో మలయాళంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'లూసీఫర్' భారీ విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా అప్పుడు ప్రేక్షకుల ముందుక వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు లూసీఫర్ చిత్రానికి సీక్వెల్ కూడా వచేసింది. L2 : ఎంపురాన్ గా మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన డే1 కలెక్షన్లు ఇలా ఉన్నాయి. మొదటిరోజే మోహన్ లాల్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపడం ఆసక్తికరంగా మారింది.
ఎంపురాన్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా మంచి స్పందన వచ్చింది. ట్రేడ్ వర్గాలు తెలిపిన ప్రకారం.. ఎంపురాన్ డే1 వరల్డ్ వైడ్ గా రూ.58 కోట్ల గ్రాస్ అందుకుందని తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే రూ.22 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్యపరించింది. ఇందులో మలయాళం స్టేట్ లో రూ.19.45 కోట్ల నెట్, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.8 లక్షలు, హిందీలో రూ.5 లక్షలు, కేరళలో రూ.5 లక్షలు నెట్ వసూల్ అచేసినట్టు ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. అయితే వీటికి మరిన్ని లెక్కలు కూడా యాడ్ కావాల్సి ఉందని తెలుస్తోంది. వాటితో రూ.25 కోట్ల వరకు కేవలం ఇండియా నెట్ వసూలై ఉంటుందని తెలుస్తోంది.

అయితే, ఎల్2 : ఎంపురాన్ చిత్రం పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన, నటించిన 'లూసీఫర్2', 'ఆడుజీవితం' చిత్రాలను వెనక్కి నెట్టేసి బాక్సాఫీస్ వద్ద డే1 కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ 'లూసీఫర్' 4 రోజుల వీకెండ్ కలెక్షన్లు 55.40 కోట్లు నమోదవ్వగా.. రీసెంట్ గా వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడుజీవితం' చిత్రం 4 రోజుల వీకెండ్ కలెక్షన్లు రూ.64.14 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్లు L2 : లూసీఫర్ డే1నే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటూ ఇంకా వసూళ్ల లెక్కలు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి
అడ్వాన్డ్ టికెట్ల బుక్కింగ్స్ కు కూడా జోరుగా అందాయి. మార్చి 21న 6,28,140 టికెట్లు, మార్చి 22న 1,61,060 టికెట్లు, మార్చి 23న 1,09,050 టికెట్లు, మార్చి 24న 1,00,620, మార్చి 25న 1,30,510 టికెట్లు, మార్చి 26 2,04,780 టికెట్లు బుక్ మై షో ద్వారా తెగాయి. మొత్తం 13,34,160 టికెట్ల అమ్మకాలతో ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత ప్రారంభించింది.
ఇక ఈ చిత్రాన్ని శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. లూసీఫర్ 2 : ఎంపురాన్ చిత్రానికి 150 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. ఎంపురాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందని, ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్లు అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హిందీలో అనిల్ తడాని, తెలుగులో దిల్ రాజు, కన్నడలో హోంబలే ఫిల్మ్స్, తమిళంలో గోకులం గోపాలన్ రిలీజ్ చేశారు. టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











