Empuraan Day 2 Collections : 48 గంటల్లో ఎంపురాన్‌తో 100 కోట్ల సరికొత్త చరిత్ర.. మోహన్ లాల్ బాక్సాఫీస్ జాతర

'లూసీఫర్' భారీ విజయం తర్వాత ఇప్పుడు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. L2 : ఎంపురాన్ మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం విశేషం. మలయాళంలో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.

ఇక ఈ సీక్వెల్ కు పాజిటివ్ టాక్ దక్కడంతో రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ అందాయి. ఏకంగా రూ.65 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మలయాళం ఇండస్ట్రీలోనే ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ లో రికార్డు క్రియేట్ చేసింది. మొదటిరోజు అత్యధిక వసూళ్లు అందుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక డే2 ఈ చిత్రాన్ని అందిన వసూళ్ల వివరాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రేడ్ నిపుణులు, సాక్ నిల్క్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. రెండో రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

Mohanlal Prithviraj Sukumaran Day 2 Box Office Collections Worldwide

డే1న ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ.67.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.24.50 కోట్లు కాగా, ఇండియా నెట్ రూ.21 కోట్లుగా కలెక్షన్లు అందాయి. మరోవైపు ఓవర్సీస్ లో రూ.43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఆశ్చర్యపరిచింది. మొదటిరోజు 62 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని కూడా సొంతం చేసుకుంది. కాగా, ఇండియా వరకు మలయాళంలో రూ.18.6 కోట్ల నెట్, తెలుగులో రూ.1.15 కోట్లు, తమిళంలో రూ.70 లక్షలు, హిందీలో రూ.50 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు నెట్ వసూల్ చేసింది. మిగితా ఏరియాల్లో రూ.2.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.

ఇక డే2 విషయానికొస్తే... ఇండియాలో స్టేట్ వైజ్ గా నెట్ వసూళ్లు ఇలా ఉన్నాయి. మలయాళంలో రూ.10.75 కోట్లు, కన్నడలో రూ.3 లక్షలు, తెలుగులో రూ.27 లక్షలు, తమిళంలో రూ.30 లక్షలు, హిందీలో రూ.40 లక్షల వరకు నెట్ వసూల్ చేసింది. మొత్తంగా రూ.11.75 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. కాగా, మలయాళంలో రూ.30 కోట్ల డే2 వరకు నెట్ వసూళ్లే రాబట్టగలిగిందీ చిత్రం. ఇక సాక్ నిల్క్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. డే2 వరకు ఇండియా నెట్ రూ.32.75 కోట్లు వసూళ్లైంది. డే2 రూ.25 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎంపురాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్లు రాబట్టింది. దీంతో రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఉంది. అయితే ఈ చిత్రం మొదటి వీకెండ్ పూర్తయ్యే లోపే రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం సులభమని ట్రేడ్ వర్గాలు చెబుతుండగా... కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల కలెక్ట్ చేసి మలయాళం ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రను సృష్టించిందని మేకర్స్ తెలిపారు. ఇలా బాక్సాఫీస్ వద్ద మోహన్ లాల్ జాతర జోరు కొనసాగుతోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా 150 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. చిత్రంలో టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X