Empuraan Day 3 Collections : ఎంపురాన్ డే3 కలెక్షన్లు.. మోహన్ లాల్ ర్యాంపేజ్.. ఎంత వసూలైందంటే?
'లూసీఫర్'కు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం L2 : ఎంపురాన్. మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లలో మోహన్ లాల్ ఊచకోత ప్రారంభించారు. 24 గంటలలోపే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళం చిత్ర పరిశ్రమలో ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. అయితే ఇప్పుడు మాత్రం ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా దూసకుపోతోంది.
ఈ చిత్రంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక నటుడు పృథ్వీరాజ్ సుకుమారనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారనే సంగతి తెలిసిందే. మలయాళంలో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీ గ్రాండ్ గా విడుదలైంది. ఈ సీక్వెల్ కు హిట్ టాక్ దక్కడంతో బాక్సాపీస్ వద్ద షాకింగ్ కలెక్షన్ల నమోదవుతున్నాయి. సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. డే3 వరకు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

డే1న L2 : ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ.67.50 కోట్ల గ్రాస్, రూ.24.50 కోట్లు ఇండియా గ్రాస్, రూ.21 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్లు వసూల్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ లో రూ.43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక డే1న మలయాళంలో రూ.18.6 కోట్ల నెట్, తెలుగులో రూ.1.15 కోట్లు, తమిళంలో రూ.70 లక్షలు, హిందీలో రూ.50 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు నెట్, మిగితా ఏరియాల్లో రూ.2.75 కోట్ల గ్రాస్ వసూల్ అందుకుంది.
డే2 విషయానికొస్తే.. ఇండియా గ్రాస్ రూ.38 కోట్లు, ఇండియా నెట్ రూ.32.50 కోట్లు అందుకుంది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.102 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అందాయి. ఇక ఓవర్సీస్ లో మొత్తంగా రూ.64 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఇందులో మలయాళంలో రూ.10.75 కోట్లు నెట్, కన్నడలో రూ.3 లక్షలు నెట్, తెలుగులో రూ.27 లక్షలు నెట్, తమిళంలో రూ.30 లక్షలు నెట్, హిందీలో రూ.40 లక్షల వరకు నెట్ వసూల్ చేసింది.
డే3 కూడా శనివారం కావడంతో మరింత జోరుగా వసూళ్లు రాబట్టింది మోహన్ లాల్ ఎంపురాన్. ఈ చిత్రం మలయాళంలో దుమ్ములేపుతుండగా... తెలుగు, తమిళం, హిందీలో వసూళ్లను హోల్డ్ చేస్తోంది. డే3న మలయాళంలో రూ.15.28 కోట్ల నెట్, తెలుగులో రూ.26 లక్షలు, తమిళంలో రూ.45 లక్షలు, హిందీలో రూ.41 లక్షలు నెట్ వసూల్ చేసింది. ఇలా ఇండియా మొత్తంగా రూ.13.50 కోట్ల వరకు నెట్ అందుకుంది. వరల్డ్ వైగా రూ.28 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు తెలుపుతున్నాయి.
ఎంపురాన్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూ.150 కోట్లతో నిర్మించారు. చిత్రంలో టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











