Empuraan Day 4 Collections : ఎంపురాన్ డే4 కలెక్షన్లు.. దెబ్బ పడ్డా తగ్గేదేలే

లూసీఫర్ సీక్వెల్ L2 : ఎంపురాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఆడియెన్స్ నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుందీ సీక్వెల్. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతోంది. తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ కలెక్షన్లలో మోహన్ లాల్ సంచలన వసూళ్లను అందుకున్నారు. రికార్డు స్థాయిలో 24 గంటలలోపే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా రెండు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. లూసీఫర్ తో పాటు, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన L2 : ఎంపురాన్ ను కూడా నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారనే డైరెక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విజయవంతంగా థియేట్రికల్ రన్ ను కొసాగిస్తోంది. ఈ సందర్భంగా డే1 నుంచి డే4 వరకు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు చేసిందనేది చూద్దాం.

Mohanlal Prithviraj Sukumaran Day 4 Box Office Collections Worldwide

సాక్ నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. ఎంపురాన్ బాక్సాఫీస్ లెక్కలు ఇలా ఉన్నాయి. డే1న L2 : ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ.67.50 కోట్ల గ్రాస్, రూ.24.50 కోట్లు ఇండియా గ్రాస్, రూ.21 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్లు అందుకుంది. ఓవర్సీస్ లో రూ.43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. డే2న వరల్డ్ వైడ్ గా రూ.102.50 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇందులో డే2 వరకు ఇండియా గ్రాస్ రూ.37.50 కోట్లు అందుకుంది. ఇండియా నెట్ రూ.32.10 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.60 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. డే3న శనివారంతో కలిపి రూ.53 కోట్ల వరకు ఇండియా గ్రాస్ చేరుకుంది. ఇండియా నెట్ రూ.45.35 కోట్ల వరకు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.138 కోట్లు గ్రాస్ వసూలైంది.

డే4న ఆదివారం వసూళ్లు కూడా జోరుగానే ఉన్నాయి. 4వ రోజున మలయాళంలో రూ.13 కోట్ల నెట్, తెలుగులో రూ.31 లక్షలు, తమిళంలో రూ.45 లక్షలు, హిందీలో రూ.20 లక్షలు, కన్నడలో రూ.4 లక్షల నెట్ వసూల్ అందుకుంది. ఇలా ఇండియా నెట్ డే4న 14 కోట్ల వరకు వసూలైంది. దీంతో నాలుగు రోజుల్లో ఇండియా నెట్ వసూళ్లు రూ.59.35 కోట్ల వరకు చేరుకుంది. ఇక గ్రాస్ ఇండియా గ్రాస్ విషయానికొస్తే.. రూ.35 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

అయితే, ఈ చిత్రంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నా భారీ గానే వసూళ్లు సాధిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొన్నటి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా సినిమా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రంలోని 17 సీన్లను తొలగించాలని ఆదేశించింది. బుధవారం నుంచి ఆ సీన్లను తొలగించి రీఎడిటింగ్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ఎంపురాన్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూ.150 కోట్లతో నిర్మించారు. చిత్రంలో టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X