Empuraan Day 5 Collections : 200 కోట్లతో ఊచకోత.. ఎంపురాన్ డే5 కలెక్షన్లు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే?

లూసీఫర్ కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం L2 : ఎంపురాన్. ఈ చిత్రం మార్చి27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు నుంచే మంచి అంచనాలను కలిగి ఉన్న ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు వరల్డ్ వైడ్ గానూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యిందీ చిత్రం. ప్రస్తుతం ఇండియాలో ఈ చిత్రానిదే పై చేయి. ఇద్దరు బడా హీరోలు మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఎంపురాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి. కేవలం 48 గంటల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుని సంచలనం సృష్టించింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కేవలం రెండు రోజుల్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఎంపురాన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, L2 : ఎంపురాన్ ను నటుడు పృథ్వీరాజ్ సుకుమారనే డైరెక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం థియేట్రికల్ రన్ విజయవంతంగా కొనసాగుతోంది.

Mohanlal Prithviraj Sukumaran Day 5 Box Office Collections Worldwide

ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన బాక్సాఫీస్ లెక్కల విషయానికొస్తే.. డే1న L2 : ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ.67.50 కోట్ల గ్రాస్, రూ.24.50 కోట్లు ఇండియా గ్రాస్, రూ.21 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్లు అందుకుంది. ఓవర్సీస్ లో రూ.43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. డే2న వరల్డ్ వైడ్ గా రూ.102.50 కోట్లు వసూల్ చేసింది. ఇక డే2 వరకు ఇండియా గ్రాస్ రూ.37.50 కోట్లు, ఇండియా నెట్ రూ.32.10 కోట్లు, ఓవర్సీస్ లో రూ.60 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. డే3న రూ.53 కోట్ల ఇండియా గ్రాస్, ఇండియా నెట్ రూ.45.35 కోట్ల వరకు నెట్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.138 కోట్లు గ్రాస్ కు చేరుకుంది.

ఇక 4వ రోజు వరకు ఈ చిత్రం వసూళ్లు వరల్డ్ వైడ్ గా రూ.174 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసింది. కేవలం డే4న రూ.36 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఇక డే5 కూడా ఈచిత్రం జోరుగానే వసూళ్లు చేసింది. డే5న సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. దీంతో ఎంపురాన్ కలెక్షన్లు డే5 తో రూ.200 కోట్లకు చేరుకుంది. కేవలం ఐదురోజుల్లో ఇంతటి సెన్సేషన్ గా వసూళ్లు అందడం విశేషంగా మారింది.

ఇక డే5న వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.26 కోట్లు కాగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సాక్ నిల్క్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. డే5న మలయాళంలో రూ.8.91 కోట్ల నెట్, కన్నడలో రూ.3 లక్షలు, తెలుగులో రూ.15 లక్షలు, తమిళంలో రూ.29 లక్షలు, హిందీలో రూ.22 లక్షలు వసూళ్లు చేసింది. దీంతో ఇండియా నెట్ రూ.68.57 కోట్లకు చేరుకుంది. ఎంపురాన్ కి ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాల్సి ఉంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూ.150 కోట్లతో నిర్మించారు. టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రల్లో నటించి అలరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X