Empuraan Day 6 Collections :మోహన్ లాల్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. ఎంపురాన్ 6వ రోజున ఎన్ని కోట్లంటే?
L2 : ఎంపురాన్ చిత్రం మార్చి27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. లూసీఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. రిలీజ్ కు ముందు నుంచే హైప్ నెలకొనడంతో అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని విధంగా వసూళ్లు జరుగుతున్నాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. రూ.150 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ టార్గెన్ ను పూర్తి చేసుకుంటోంది. ఆ దిశగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది.
'సలార్' నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఇంకా కలెక్షన్లను పెంచేస్తోంది. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్షన్ మోడ్ లో కనిపించడంతో ఆడియెన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ గల్లా పెట్టే నిండిపోతోంది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్, సాక్ నిల్క్ రిపోర్ట్ ప్రకారం 'ఎంపురాన్' బాక్సాఫీస్ లెక్కలు ఇలా ఉన్నాయి. కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచనంగా మారిన ఈ చిత్రం.. రోజురోజుకు ఆసక్తికరంగా వసూళ్లను రాబడుతోంది.

మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, అటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వివరాలు ఇలా ఉన్నాయి. డే1న L2 : ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ.67.50 కోట్ల గ్రాస్, రూ.24.50 కోట్ల ఇండియా గ్రాస్, రూ.21 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.43 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ అయ్యింది. డే2 వరకు వరల్డ్ వైడ్ గా రూ.102.50 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.37.50 కోట్లు, ఇండియా నెట్ రూ.32.10 కోట్లు, ఓవర్సీస్ లో రూ.60 కోట్ల వరకు వసూళ్లు చేరుకున్నాయి. అలాగే డే3 వరకు రూ.53 కోట్ల ఇండియా గ్రాస్, ఇండియా నెట్ రూ.45.35 కోట్ల వరకు నెట్ వసూళ్లు చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ గా రూ.138 కోట్లు గ్రాస్ వసూల్ చేయగలిగింది.
ఇక డే4న ఇండియా గ్రాస్ రూ.69 కోట్ల వరకు పెరిగింది. ఇండియా నెట్ రూ.59 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్లు రూ.105 కోట్ల వరకు చేరాయి. వరల్డ్ వైడ్ గా రూ.174 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. డే5 వరకు వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ఇండియా గ్రాస్ రూ.82 కోట్లు, ఇండియా నెట్ 70.15 లక్షలకు, ఓవర్సీస్ కలెక్షన్లు రూ.118 కోట్లకు చేరుకుంది. ఇక కేవలం డే6న మాత్రమే ఇండియా నెట్ రూ.9 కోట్లు వసూళ్లైందని సాక్ నిల్క్ రిపోర్ట్ అందించింది. వీటికి మరిన్ని లెక్కలు యాడ్ కావాల్సి ఉందని తెలిపింది. దీంతో డే6 వరకు ఇండియా నెట్ రూ.79.15 కోట్లకు చేరుకుంది.
ఎంపురాన్ కి వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్ల బిజినెస్ అయ్యింది. దీంతో రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. మొదటి వారంలోనే ఎంపురాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కాబోతుండటం విశేషంగా మారింది. ఈ చిత్రంలో టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రల్లో నటించి అలరించారు. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.


Click it and Unblock the Notifications











