Empuraan Day 7 Collections : ఎంపురాన్ డే7 కలెక్షన్లు.. మోహన్ లాల్ జాతర.. ఫస్ట్ వీక్ రిపోర్ట్
తమిళ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన L2 : ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. మార్చి27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ రోజురోజుకు ఆసక్తికరంగా వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే రూ.250 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ గా మారిందీ చిత్రం. ప్రస్తుతం ఫస్ట్ వీక్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
సాక్ నిల్క్, ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. L2 : ఎంపురాన్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.67.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇండియాలో రూ.24.50 కోట్ల గ్రాస్, రూ.21 కోట్లు ఇండియా నెట్ రాబట్టింది. ఓవర్సీస్ లో రూ.43 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. 2వ రోజున వరల్డ్ వైడ్ గా రూ.35 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.22 కోట్లు కాగా, నెట్ రూ.11.1 కోట్లు అందుకుంది. ఇలా కేవలం 48 గంటల్లోనే ఎంపురాన్ రూ.102.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన మొదటి మలయాళం చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక 3వ రోజు శనివారం కావడంతో వరల్డ్ వైడ్ గా రూ.36 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.26.50 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఇండియా నెట్ రూ.13.25 కోట్లు వసూళ్లు చేసింది. 4వ రోజున ఆదివారం వరల్డ్ వైడ్ గా రూ.36.50 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియా గ్రాస్ రూ.27 కోట్లు, ఇండియా నెట్ రూ.13.65 కోట్లు వసూలైంది.
5వ రోజున వరల్డ్ వైడ్ గా రూ.200 మార్క్ చేరుకుంది. ఇక ఇండియా నెట్ రూ.11.15 కోట్లు వసూలైంది. ఇండియా గ్రాస్ రూ.21 కోట్లు వసూళ్లు చేసింది. 6వ రోజు వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా, ఇండియా గ్రాస్ రూ.18 కోట్ల వరకు నమోదైంది. ఇండియా నెట్ రూ.8.55 కోట్లు కావడం విశేషం. ఇలా 6 రోజుల్లో ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ.222 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇండియా గ్రాస్ 92 కోట్లు వసూళ్లైంది. ఇండియా నెట్ రూ.78.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.130 కోట్ల మార్క్ ను దాటింది.
ఇక 7వ రోజు ఇండియాలో రూ.5.50 కోట్ల నెట్ అందుకుంది. గ్రాస్ రూ.10 కోట్లకు పైగా వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ లెక్కలు కలుపుకొని ఎంపురాన్ ఏడో రోజు రూ.250 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం 2వ వారంలో బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి. రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రూ.110 కోట్ల నెట్, రూ.220 కోట్ల గ్రాస్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు.
ఈ చిత్రంలో టొవినో థామస్, మంజూ వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రల్లో నటించి అలరించారు. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.


Click it and Unblock the Notifications











