Empuraan Advance Booking Collections: ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్ ఊచకోత.. వరల్డ్ వైడ్ ఎన్ని కొట్లంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, 'సలార్' స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ఎల్2 : ఎంపురాన్. ఇద్దరు బడా హీరోలు కలిసి నటించిన ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సకుమారన్ దర్శకత్వం వహించారు. లూసిఫర్ చిత్రాకిని సీక్వెల్ గా ఇప్పుడు L2 : ఎంపురాన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మార్చి 27న ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా థియేటర్లలో విడుదవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి బాక్సాఫీస్ రిపోర్ట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 21 నుంచి ఈ ,చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్ ప్రారంభమైంది. అడ్వాన్డ్ టికెట్ల బుక్కింగ్స్ కు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లూసీఫర్ సీక్వెల్ ఎంపురాన్ కు మంచి వసూళ్లు అందాయి. మార్చి 21న 6,28,140 టికెట్లు, మార్చి 22న 1,61,060 టికెట్లు, మార్చి 23న 1,09,050 టికెట్లు, మార్చి 24న 1,00,620, మార్చి 25న 1,30,510 టికెట్లు, మార్చి 26 2,04,780 టికెట్లు బుక్ మై షో ద్వారా అడ్వాన్డ్ బుకింగ్స్ జరిగాయి. ఇలా మొత్తం 13,34,160 టికెట్ల అమ్మకాలతో ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత ప్రారంభించింది.

ఇప్పటి వరకు టాప్ 5 అడ్వాన్డ్ బుకింగ్స్ లో ఈ చిత్రాలున్నాయి. పుష్ప2 30 లక్షల టికెట్స్, లియో 22.86 లక్షల టికెట్స్, కల్కి 2898 ఏడీ 17.21 లక్షల టికెట్స్, సలార్ 16.53 లక్షల టికెట్స్ ను అమ్మి మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక 6వ స్థానంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి దర్శకత్వం వహించిన లూసీఫర్ సీక్వెల్ ఎంపురాన్ 13.34 లక్షలకు పైగా అడ్వాన్డ్స్ గా టికెట్లు అమ్మింది. 7వ స్థానంలో దేవర 13.19 లక్షలు, యానిమల్ 12.64 లక్షలు, జైలర్ 11.94 లక్షలు, ది గోట్ 11.91 లక్షల అడ్వాన్డ్స్ టికెట్లు అమ్మి రికార్డు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని మూడు బ్యానర్లు శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. 150 కోట్ల బడ్జెట్ లూసీఫర్ 2 : ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ విషయాన్ని రీసెంట్ గా నిర్మాత దిల్ రాజ్ ప్రమోషన్స్ లో రివీల్ చేశారు. 2019లో వచ్చిన లూసీఫర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సీక్వెల్ ను ఎంపురాన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఆ చిత్రం విజయం సాధించింది.
ఎంపురాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.30కోట్లు ప్రీ రిలీజ్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మలయాళంలో రిలీజ్ అవుతుండగా హిందీలో అనిల్ తడాని, తెలుగులో దిల్ రాజు, కన్నడలో హోంబలే ఫిల్మ్స్, తమిళంలో గోకులం గోపాలన్ విడుదల చేస్తున్నారు. ఇలా లూసీఫర్ 2 : ఎపురాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో టొవినో థామస్, మంచు వారియర్, అభిమన్యు సింగ్, సాయి కుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సుజిత్ వాసుదేవ్ చూడగా, దీపక్ దేవ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











