twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    6 రోజుల్లో రూ. 100 కోట్లు... నిజం కాదా? మోహన్‌లాల్ మూవీ కలెక్షన్లపై వివాదం!

    |

    మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'లూసిఫెర్' మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. సినిమా విడుదలైన 6వ రోజు కూడా అన్ని ఏరియాల్లో తొంబై శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధిస్తూ వసూళ్లు అదరగొడుతోంది.

    ఈ చిత్రం విడుదలైన 4 రోజుల్లోనే రూ. 50 కోట్ల వసూళ్లు సాధించడం ద్వారా... అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న తొలి మలయాళ చిత్రంగా రికార్డులకెక్కింది. వీక్ డేస్‌లో భారీగా కలెక్షన్స్ సాధిస్తూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.

    6 రోజుల కలెక్షన్ ఎంతంటే..?

    6 రోజుల కలెక్షన్ ఎంతంటే..?

    కేరళ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘లూసిఫెర్' చిత్రం తొలి 6 రోజుల్లో రూ. 78 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే రూ. 100 కోట్లు వచ్చినట్లు వార్తలు నిజం కాదా?

    ఇప్పటికే రూ. 100 కోట్లు వచ్చినట్లు వార్తలు నిజం కాదా?

    అయితే కేరళలోని కొన్ని టాప్ మలయాళ మీడియా సంస్థలు ‘లూసిఫెర్' చిత్రం 6 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు ప్రచురించాయి. అయితే ఇది అసాధ్యమే అనే వాదన వినిపిస్తోంది. 5 వ రోజు వరకు రూ. 62 కోట్లు వసూలు చేసిన చిత్రం ఒక్క రోజులోనే రూ. 100 కోట్ల మార్కును ఎలా అందుకుంటుంది? అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు.

    ఆ వార్తను తొలగించారు

    ఆ వార్తను తొలగించారు

    ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు ప్రచురించిన వార్తపై విమర్శలు రావడంతో ఓ ప్రముఖ మలయాళ ఆన్‌లైన్ పత్రిక తన పోర్టల్ నుంచి ఈ వార్తను తొలగించింది. ‘లూసిఫెర్' వసూళ్ల వ్యవహారం ఇపుడు మాళయాలం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

    చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన లేదు

    చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన లేదు

    ‘లూసిఫెర్' చిత్ర బృందం నుంచి కానీ, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ నుంచి కానీ... 6 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఈ విషయమై జరుగుతున్న రచ్చపై కూడా మూవీ బృందం మౌనంగానే ఉంటోంది.

    లూసిఫెర్

    లూసిఫెర్

    లూసిఫెర్ చిత్రంలో మోహన్ లాల్... స్టీఫెన్ నెదుమ్‌పల్లి అనే పొలిటీషియన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో ఇంకా వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టోవినో థామస్, ఫాజిల్, సాయి కుమార్, కలాభవన్ షాజోన్, జాన్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    As per the latest repors, Mohanlal's Lucifer movie has collected Rs 78 crores in six days, and in all probabilities, it will enter the elite Rs 100 crore club in the next couple of days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X