మాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్.. మోహన్‌లాల్ టాప్ 5 బ్లాక్‌బస్టర్స్ ఇవే!

మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal)ను తన అభిమానులు లాలెట్టన్ (Lalettan) అని అభిమానులు పిలుచుకుంటారు. మోహన్‌లాల్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో ఆయనో అధ్యాయం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన కెరీర్‌లో 400కు పైగా సినిమాలు చేసి, ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన నటుల్లో ఒకరు. డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్ ఏ జానర్ అయినా సరే, మోహన్‌లాల్ తన నటనతో ప్రేక్షకులను పూర్తిగా కథలో ముంచెత్తగలగడం ఆయన ప్రత్యేకత.

66 ఏండ్ల వయస్సులోనూ యంగ్ హీరో, హీరోయిన్లతో పోటీపడుతూ నటిస్తున్నారు. అంతేకాదు.. ఆయన స్టామినా తగ్గలేదని బాక్సాఫీస్ కలెక్షన్లు చెబుతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లలో వచ్చిన ఆయన సినిమాలు మాలీవుడ్‌ను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలను పరిశీలిస్తే, మోహన్‌లాల్ ఎందుకు 'రికార్డుల రారాజు'గా నిలిచారో అర్థమవుతుంది.

Mohanlal Top 5 Highest Grossing Movies Empuraan to Drishyam 3 Box Office Records

మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా పులిమురగన్ (Pulimurugan) తెలుగులో మన్యంపులి. 2016లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మలయాళ సినిమా చరిత్రను పూర్తిగా మార్చేసింది. దాదాపు రూ. 140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మాలీవుడ్‌లో మొదటిసారిగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించడం ఇండస్ట్రీకి కొత్త దిశను చూపించింది. తెలుగు వెర్షన్ 'మన్యం పులి' కూడా మంచి స్పందన పొందింది. ముఖ్యంగా ఈ సినిమా 7 సంవత్సరాల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక మోహన్‌లాల్ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఎల్ 2 :ఎంపురాన్ (L2: Empuraan) పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ దాటడం, మొత్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ మూవీ మలయాళ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచేసింది. ఓవర్సీర్ లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది, మాలీవుడ్‌కు గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టింది.

మూడవ స్థానంలో నిలిచిన సినిమా లూసిఫెర్ (Lucifer). పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు ఉన్నాయి. థియేట్రికల్ రన్ మాత్రమే కాదు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా సుమారు రూ.200 కోట్ల మార్కును దాటింటి.ఈ సినిమా మోహన్‌లాల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అదనంగా, ఈ సినిమాకే సీక్వెల్‌గా 'ఎంపురాన్' రావడం దీని ప్రాధాన్యతను మరింత పెంచింది. ఆ కాలంలో మలయాళ సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా చరిత్ర సృష్టించింది.

ఇక తుదరం (Thudarum) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లకు పైగా సాధించి, మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా కేరళలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధించడం.

ఇక లెటెస్ట్ గా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ దృశ్యం 3. ఈ సినిమా కూడా రికార్డు దిశగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 58 గంటల్లోనే రూ 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఈ సినిమా స్టామినాను చూపుతుంది. మొదటి మూడు రోజుల్లో రూ. 117 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో ఊహించని రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సినిమా మరో ఇండస్ట్రీ హిట్‌గా మారే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Read more about: mohanlal lucifer Drishyam 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X