Mollywood Times 3 days Box Office: పెద్దిని వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. మాలీవుడ్ టైమ్స్‌కు ఎన్ని కోట్ల కలె

దేశ సినీ పరిశ్రమలో మలయాళ చిత్రాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం మాలీవుడ్ టైమ్స్. సినిమా బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో యువ హీరోలు నస్లేన్, షరాఫ్ యూ ధీన్, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ చిత్ర దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించగా, రాము సునీల్ రచనా సహకారం అందించారు. ఈ సినిమాను ఆశీక్ ఉస్మాన్ నిర్మించారు.

మాలీవుడ్ టైమ్స్ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్: జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫి: విశ్వజిత్ ఒడుక్కాతిల్, ఎడిటింగ్: నిధిన్ రాజ్ అరోల్, అభినవ్ సుందర్ నాయక్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఆశీక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం జూన్ 5వ తేదీన దేశవ్యాప్తంగాను, ఓవర్సీస్‌లోను రిలీజైంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Mollywood Times 3 days Box Office

యువ హీరోలు, నూతన నటీనటులు నటించిన ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. డార్క్ కామెడీగా రూపొందిన ఈ మూవీని ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ భారీగా జరగడంతో రిలీజ్‌కు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం సుమారుగా 5 కోట్ల రూపాయల థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మాలీవుడ్ టైమ్స్ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సందడి కనిపించింది. తొలి రోజు నుంచే ఈ చిత్రం భారీ వసూళ్లను నిలకడగా సాధిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 1.8 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.9 కోట్ల నెట్ కలెక్షన్లు, మూడో రోజు 1.9 నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 5.4 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను, 6.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో అధిక భాగం మలయాళంలో వసూలు చేసిన కలెక్షన్లే కావడం విశేషంగా మారింది.

బడ్జెట్, నటీనటుల విషయంలో చిన్న సినిమాగా తెరకెక్కిన మాలీవుడ్ టైమ్స్ ఇటీవల రిలీజైన పాన్ ఇండియా మూవీ పెద్ది చిత్రంతో కేరళ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నది. పెద్ది చిత్రం గత నాలుగు రోజుల్లో 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ల నుంచి 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే మాలీవుడ్ టైమ్స్ మాత్రం ఇప్పటికే 6.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో స్టార్ పవర్ కంటే కంటెంట్ ముఖ్యమని కేరళ సినీ అభిమానులు రుజువు చేశారనే టాక్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X