GabbarSingh 4k Advance Booking: లక్షకు పైగా టికెట్స్ ఔట్..ప్రీ రిలీజ్ బుకింగ్స్‌తోనే గబ్బర్ సింగ్ వసూళ్ల జాతర
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం అంటే అభిమానులకు పండుగ రోజు. ఈ ఏడాది ఇది మరింత ప్రత్యేకం. పదేళ్ల పోరాటం ఫలించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సగర్వంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. శాసనసభ్యుడిగా గెలవడంతో పాటు ప్రభుత్వంలోనూ భాగమై చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా , ఆరు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతటి చారిత్రాక విజయం నేపథ్యంలో ఈసారి జనసేనాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో పవన్ కళ్యాణ్ హిట్ మూవీ గబ్బర్ సింగ్‌ను 4కే వెర్షన్‌లో రిలీజ్ చేయాలని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ డిసైడ్ అయ్యారు. పవన్ కెరీర్‌లో గబ్బర్ సింగ్‌కు ప్రత్యేక స్థానముంది. ఆ సినిమాకు ముందు పవర్‌స్టార్ ఫ్లాపుల్లో ఉన్నారు. వచ్చిన ప్రతి మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా పవన్ స్టార్‌డమ్ రవ్వంత కూడా తగ్గగపోగా మరింత పెరిగింది. ఇది ఫ్యాన్స్‌ని సంతోషపెట్టినా.. తమ హీరో హిట్ కొడితే బాగుండునని వారు ఏదో మూలన అనుకుంటూనే ఉన్నారు.

త్రివిక్రమ్ , సోనూ సూద్‌ల సూచన మేరకు దబాంగ్ తెలుగు రీమేక్ రైట్స్‌ని బండ్ల గణేష్ కొన్నారు. అసలే ఆయన పవన్ కళ్యాణ్ భక్తుడు కావడంతో ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించారు. దబాంగ్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు హరీశ్ శంకర్. పవన్ సరసన శృతీ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అప్పటికీ ఆమె కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతూ ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకుంది.
కథ, క్యాస్టింగ్ విషయంలో అప్పటికే ఇండస్ట్రీ జనాల పెదవి విరుపులు మొదలవ్వగా.. పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతోనే ఉన్నారు. మే 11, 2012లో సమ్మర్ కానుకగా రిలీజైన గబ్బర్ సింగ్ సంచలన విజయం నమోదు చేసింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు... 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించి వారి ఆకలిని తీర్చారు హరీష్ శంకర్.
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ బాగా ఊపందుకున్న నేపథ్యంలో గబ్బర్ సింగ్‌ను పవన్ బర్త్ డే నాడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. రీ రిలీజ్‌లోనూ గబ్బర్ సింగ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్‌లోనే వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. నార్త్ అమెరికాలో 100కు పైగా లోకేషన్‌లలో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 12 షోలకు గాను ప్రీ బుకింగ్స్ ద్వారా 4,284 ఆస్ట్రేలియా డాలర్లు కొల్లగొట్టింది. అమెరికాలోని 55 లోకేషన్స్‌లో రూ.13 లక్షలకు పైగా వసూళ్లు సాధించింది.
హైదరాబాద్‌లో ప్రీమియర్స్ ద్వారా 17 లక్షలు, తొలి రోజు బుకింగ్స్ ద్వారా రూ.1.05 కోట్లు మొత్తంగా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.3 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది గబ్బర్ సింగ్. తద్వారా రీ రిలీజ్‌లలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తెలుగు సినిమా దిశగా దూసుకెళ్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫాం బుక్‌మైషోలో ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారంటే గబ్బర్ సింగ్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











