twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mosagallu collections: బాక్సాఫీస్ వద్ద విష్ణు మంచు మూవీ.. కలెక్షన్ల పరిస్థితి ఏంటంటే!

    |

    టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విష్ణు మంచు మరోసారి కఠిన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఆయన నిర్మించిన మోసగాళ్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

    చీరకట్టులో అదరగొట్టిన హానీ రోజ్.. యువ తార గ్లామర్‌కు ఫిదా కావాల్సిందే!

     భారీ బడ్జెట్‌తో మోసగాళ్లు

    భారీ బడ్జెట్‌తో మోసగాళ్లు

    లాక్‌డౌన్ కారణంతో రిలీజ్‌కు జాప్యం ఏర్పడిన నేపథ్యంలో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోసగాళ్లు భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో కలిపి సుమారు రూ.51 కోట్లతో తెరకెక్కించారు.

    మంచు విష్ణు డేరింగ్ రిలీజ్

    మంచు విష్ణు డేరింగ్ రిలీజ్

    టాలీవుడ్‌లో రెగ్యులర్‌గా జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్‌కు భిన్నంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో విష్ణు మంచు స్వయంగా రిలీజ్ చేశారు. శాటిలైట్, ఇతర బిజినెస్ తర్వాత ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.21 కోట్లకుపైగానే వసూలు చేయాలనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    భారీ సంఖ్యలో థియేటర్లలోకి

    భారీ సంఖ్యలో థియేటర్లలోకి

    తెలుగు రాష్ట్రాల్లో మోసగాళ్లు సినిమా భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజైంది. నైజాంలో 85 థియేటర్లలో, ఏపీలో 245 థియేటర్లలో రిలీజైంది. విష్ణు మంచు కెరీర్‌లో అత్యధిక సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాగా పేర్కొంటున్నారు.

    నైజాం, ఏపీలో వసూళ్ల పరిస్థితి ఏంటంటే

    నైజాం, ఏపీలో వసూళ్ల పరిస్థితి ఏంటంటే

    అయితే మోసగాళ్లు సినిమా ప్రమోషన్ ఓ మోస్తారుగా జరిగినప్పటికీ.. ఏపీ, తెలంగాణలో ఓపెనింగ్స్ అంతగా లేకపోవడం ఆశ్చర్యంగా మారింది. దాదాపు శుక్రవారం మధ్యాహ్నానికి 40 శాతం అక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, బొబ్బిలి, పలాసలో కలెక్షన్లు నామమాత్రంగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

    తొలి రోజు కలెక్షన్లు ఎలా అంటే

    తొలి రోజు కలెక్షన్లు ఎలా అంటే

    మోసగాళ్లు సినిమా కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజున మోస్తారు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ చిత్రం 1 కోటి నుంచి సుమారు 2 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాలను ఈ చిత్రం అధిగమిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

    English summary
    As per Wikipedia, Mosagallu movie is based on a true series of incidents that shook the Indian IT Industry and conned a whopping $380 million (2,800 Crores). Kajal as Anu, Vishnu as Arjun in lead roles. Navdeep and Naveen Chandra are in supporting roles. Produced by Vishnu Mancu, Directoed by Jeffrey Gee Chin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X