twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mosagallu, Chavu Kaburu Challaga, Sashi box office collections: 4 రోజుల్లో వచ్చింది ఇది!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కరణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాతలు మొత్తానికి సినిమాలను ధైర్యంగా రిలీజ్ చేశారు. అయితే అందులో కొన్ని సినిమాలు హిట్టయితే మరికొన్ని సినిమాలు దారుణమైన కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక ఇటీవల ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన శశి, మోసగాళ్ళు, చావు కబురు చల్లగా సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కిస్తే..

    20కోట్ల టార్గెట్ తో..

    20కోట్ల టార్గెట్ తో..

    గత శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైన మూవీలలో మంచు విష్ణు మోసగాళ్ళు ఒకటి. 50కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ గానే 30కోట్లకు పైగా లాభాలను అందించింది. ఇక సినిమాను కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమాను మార్కెట్ లోకి వదిలారు.

    మోసగాళ్ళు.. హిట్టవ్వాలి అంటే

    మోసగాళ్ళు.. హిట్టవ్వాలి అంటే

    మోసగాళ్ళు సినిమా మూడు రోజుల్లో అందుకున్న షేర్స్ 0.87కోట్లు. నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 0.77కోట్ల షేర్ మాత్రమే అందింది. అంటే ఇప్పటివరకు సినిమా కనీసం వరల్డ్ వైడ్ గా రెండు కోట్లను కూడా అందుకోలేకపోయింది. హిట్టవ్వాలి అంటే ఇంకా 19కోట్ల వరకు షేర్ రావాలి. మరి సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

     శశి 4రోజుల కలెక్షన్స్

    శశి 4రోజుల కలెక్షన్స్

    ఆది సాయి కుమార్ శశి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువ వసూళ్లను అందుకుంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్ 0.36కోట్లు. ఇక నాలుగవ రోజు 2లక్షలు మాత్రమే రావడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాకి 0.34కోట్లు మాత్రమే వచ్చాయి. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5కోట్లు. అంటే ఇంకా 3కోట్ల వరకు వెనక్కి తేవాల్సి ఉంది.

     చావు కబురు చల్లగా.. కలెక్షన్స్

    చావు కబురు చల్లగా.. కలెక్షన్స్

    టాలెంటేట్ యువ హీరో కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమా మొదటి రోజు సాలీడ్ కలెక్షన్స్ అయితే అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే 1.58కోట్ల వరకు షేర్ అందింది. ఇక నాలుగువ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 21లక్షల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates
     ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    చావు కబురు చల్లగా మొత్తం బిజినెస్ 13కోట్లు. ఇక 13.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 3కోట్లకు పైగా షేర్ ను అందుకుంది. అంటే మరో 10కోట్లను అందుకుంటేనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

    English summary
    It is a known fact that back-to-back movies are being released again in the Tollywood industry. Producers who had a lot of trouble due to the corona lock-down bravely released the films as a whole. However, if some of the films hit, other films are receiving outrageous collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X