దాసరి నారాయణ రావు "మేస్త్రి" సినిమాకు నిర్మాణ దశలో ఎంతో ప్రచారం లభించింది. అది చిరంజీవిని టార్గెట్ చేస్తూ తీసిన రాజకీయ చిత్రం కావడంతో పబ్లిసిటీ బాగా వచ్చింది. ఆ సినిమా రేంజి కంటే ఎక్కువ ప్రింట్లతో విడుదలైంది. అయినా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది. దాసరి మార్కు పాత తరం సెటైర్లను ఈ తరం ప్రేక్షకులు ఆదరించరన్నది స్పష్టమైంది. ఈ సినిమా ఆద్యంతం నీరసంగా సాగిపోయింది. దాసరి ప్రధాన పాత్రలో నటించినా ఆయన ఏ వర్గాల వారినీ ఆకట్టుకోలేకపోయారు. ఈ వారంలోనే విడుదలైన "జాజి మల్లి" సినిమాపాత కథతో బూజు మల్లిగా మిగిలిపోయింది. కలెక్షన్లు కొద్దిగా తగ్గినా అరుంధతి సినిమా చాలా థియేటర్లను పట్టుకుని వేలాడుతూ "బొమ్మాళీ, నిన్ను వదల" అంటోంది.