twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Eligible Bachelor Day 2 Collections: అఖిల్ మళ్ళీ అదే దూకుడు.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని అఖిల్ మొదటి సక్సెస్ కోసం ఎంతగా తాపత్రయపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని రేంజ్ కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు భారీ స్థాయిలో విడుదల అయ్యింది.

    ఇక మొదటిరోజు రివ్యూలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం అఖిల్ సినిమాకు పెద్దగా ప్రభావం పడలేదు. రెండో రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక కేవలం సండే రోజు కూడా అదే తరహాలో కొనసాగితే ప్రాఫిట్స్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క.

    ప్రీ రిలీజ్ బిజినెస్..

    ప్రీ రిలీజ్ బిజినెస్..

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూ. 17.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో కలిపి మొత్తం వరల్డ్ వైడ్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

    2వ రోజు వచ్చిన కలెక్షన్స్

    2వ రోజు వచ్చిన కలెక్షన్స్

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ డే కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. నైజాంలో రూ. 1.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 96 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.54 కోట్లు షేర్, రూ. 7.8 కోట్లు గ్రాస్ వచ్చింది.

    2 రోజుల్లో వచ్చిన షేర్

    2 రోజుల్లో వచ్చిన షేర్

    నైజాంలో రూ. 3.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.08 కోట్లు ఉత్తరాంధ్రలో రూ. 1.15కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 81 లక్షలు, కృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో వచ్చిన షేర్ రూ. 9.99 కోట్లు. ఇక రూ. 16.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్..

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్..

    తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో భారీ స్థాయిలో రూ. 4.54 కోట్లు కొల్లగొట్టిన 'బ్యాచ్‌లర్' వరల్డ్ వైడ్ గా కూడా అఖిల్ భారీగానే షేర్ అందుకున్నాడు. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 94 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.45 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12.38 కోట్లు షేర్‌తో పాటు రూ. 21.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Recommended Video

    Pooja Hegde, Akhil Akkineni Interview | Most Eligible Bachelor
    టార్గెట్ కు దగ్గరలోనే..

    టార్గెట్ కు దగ్గరలోనే..

    అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ రెండు రోజుల్లోనే భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లు కాగా రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ. 12.38కోట్లు రాబట్టింది. అంటే మరో 6.62 కోట్లు వస్తే క్లీన్ హిట్ అయినట్లు లెక్క. మరి అఖిల్ సినిమాకు ఆదివారం ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

    English summary
    Most Eligible Bachelor box office Day 2 Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X