Mowgli Closing Collections: మోగ్లీ క్లోజింగ్ కలెక్షన్స్.. రోషన్ కనకాల మూవీకి లాభమెంత? నష్టమెంత?
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషనల్ కనకాల నటించిన చిత్రం మోగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్‌లు సంయుక్తంగా మోగ్లీ సినిమాను నిర్మించారు. బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు, మోనికా రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు. రమా మారుతి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 13న మోగ్లీ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోగ్లీ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత? క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? రోషన్ కనకాల మూవీకి లాభమెంత? నష్టమెంత ఈ వివరాల్లోకి వెళితే..
మోగ్లీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మోగ్లీ సినిమా 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో మోగ్లీ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో రోషన్ కనకాల చిత్రంపై చిత్రసీమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 కోట్ల రూపాయల షేర్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మోగ్లీ కలెక్షన్స్ ఎంత?
షెడ్యూల్ కంటే ఒకరోజు ఆలస్యంగా విడుదలైన మోగ్లీ సినిమాకు తొలిరోజున 75 లక్షల రూపాయలు, రెండో రోజున 70 లక్షల రూపాయలు, మూడో రోజున 35 లక్షల రూపాయలు, నాలుగో రోజున 30 లక్షల రూపాయలు, ఐదో రోజున 20 లక్షల రూపాయలు, ఆరో రోజున 20 లక్షల రూపాయలు, ఏడో రోజున 3 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 8 లక్షల రూపాయలు, తొమ్మిదవ రోజున 9 లక్షల రూపాయలు, పదో రోజున 15 లక్షల రూపాయలు, పదకొండో రోజున 13 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో మొత్తంగా 3.02 లక్షల రూపాయల నికర కలెక్షన్స్.. 3.48 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చొప్పున మోగ్లీ వసూలు చేసింది.
మోగ్లీ ఓవర్సీస్ కలెక్షన్స్
రోషన్ కనకాల మూవీకి ఓవర్సీస్‌లో టఫ్ ఫైట్ ఎదురైంది. దురంధర్, అఖండ 2, పడయప్పల ధాటికి నార్త్ అమెరికాలో కలెక్షన్స్ పడిపోయాయి. డిసెంబర్ 18వ తేదీ నాటి లెక్కల ప్రకారం... మోగ్లీకి నార్త్ అమెరికాలో 70k డాలర్లు (భారత కరెన్సీలో 62.86 లక్షల రూపాయలు) వసూలు చేసింది. మిగిలిన దేశాల నుంచి మోగ్లీ సినిమాకు 20 లక్షల రూపాయలు వచ్చింది. దాంతో ఓవర్సీస్‌లో మోగ్లీకి 80 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది మోగ్లీ.
మోగ్లీకి లాభమెంత? నష్టమెంత?
డిసెంబర్ 12వ తేదీన మోగ్లీ రిలీజ్ కావాల్సి ఉండగా.. ఆ రోజున నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 విడుదల కావడంతో మోగ్లీ ఒకరోజు ఆలస్యంగా బరిలో దిగింది. మిక్స్‌డ్ టాక్‌కు తోడు అఖండ 2, దురంధర్, అవతార్ 3 తదితర చిత్రాలు రిలీజ్ కావడంతో తీవ్రమైన పోటీ మధ్య ఈ సినిమా కలెక్షన్స్ క్రమంగా పడిపోతూ వచ్చాయి. 5 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్‌కు గాను 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగా... 3 కోట్ల రూపాయలు షేర్ నష్టం వచ్చింది. 10 కోట్ల రూపాయల గ్రాస్‌కు గాను 4 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసి 6 కోట్ల గ్రాస్ నష్టాన్ని మూటకట్టుకున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే డిజిటల్ రైట్స్, ఆడియో హక్కులు, శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాత సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











