Mowgli Day 1 Collections: రోషన్ కనకాల మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. మోగ్లీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

స్టార్ యాంకర్ సుమ, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ మోగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్‌లు సంయుక్తంగా మోగ్లీ సినిమాను నిర్మించారు. బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు. రామా మారుతి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 13న మోగ్లీ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోగ్లీ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు రోషన్ కనకాల చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

మోగ్లీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మోగ్లీ సినిమా 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో మోగ్లీ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో రోషన్ కనకాల చిత్రంపై చిత్రసీమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

Mowgli Day 1 Expected Box Office Collections Worldwide Roshan Kanakala s Movie slow start at GBOC

మోగ్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 కోట్ల రూపాయల షేర్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం... ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం అదే రోజు రావడంతో మోగ్లీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13న విడుదల అయ్యింది. అయితే 12వ తేదీన రాత్రి ఈ సినిమాకు ప్రీమియర్స్ పడ్డాయి.

మోగ్లీ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
ఇక మోగ్లీ మూవీ వసూళ్లను పరిశీలిస్తే.. డిసెంబర్ 12వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తొలిరోజున సాలీడ్ బుకింగ్స్ జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సినిమాకు 31 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. హైదరాబాద్‌లో 177 షోలు, విజయవాడలో 39 షోలు, విశాఖలో 57 షోలు, వరంగల్‌లో 22 షోలు ప్రదర్శితమైనట్లు పేర్కొంది.

మోగ్లీ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలోనూ మంచి బజ్ నెలకొంది. రోషన్ కనకాల చిత్రానికి అక్కడ ప్రీమియర్స్ ద్వారా 30K డాలర్లు (భారత కరెన్సీలో 27.17 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రీమియర్స్‌తో కలిపి మోగ్లీకి తొలిరోజున నార్త్ అమెరికాలో 40 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే యూరప్, గల్ఫ్ తదితర దేశాలలో ఈ సినిమా మరో 20 లక్షల రూపాయలు రాబడుతుందని భావిస్తున్నారు. దాంతో ఫస్ట్ డే ఓవర్సీస్ నుంచి మోగ్లీకి 60 లక్షల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

మోగ్లీ చిత్రానికి తొలిరోజున సాయంత్రం 5.30 గంటల వరకు ఇండియాలో 32 లక్షల రూపాయల రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. దాంతో రోషన్ కనకాల మూవీకి ఫస్ట్ డే ఇండియాలో కోటి 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 60 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 2.20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X