Mowgli Day 2 Collections: మోగ్లీ రెండో రోజు కలెక్షన్స్... టఫ్ ఫైట్‌లో రోషన్ కనకాల ఎంత రాబట్టాడంటే?
కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు. బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సుహాస్, రియా సుమన్‌లు గెస్ట్ రోల్‌లో అలరించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్‌లు సంయుక్తంగా మోగ్లీ సినిమాను నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎం ఎం కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీత దర్శకత్వం వహించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు. రమా మారుతి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 13న మోగ్లీ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోగ్లీ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు రోషన్ కనకాల చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
మోగ్లీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మోగ్లీ సినిమా 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో రోషన్ కనకాల చిత్రంపై చిత్రసీమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 కోట్ల రూపాయల షేర్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మోగ్లీ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
భారీ అంచనాల మధ్య రిలీజైన మోగ్లీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో తొలిరోజున ఇండియా వైడ్‌గా 75 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వసూలైంది. అయితే మోగ్లీ వరల్డ్ వైడ్‌గా 1.22 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 బరిలో ఉన్నప్పటికీ మోగ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మోగ్లీ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లోనూ మోగ్లీకి టఫ్ ఫైట్ నెలకొంది. నార్త్ అమెరికాలో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ ఓ వైపు.. బాలయ్య నటించిన అఖండ 2 మధ్యలో ఈ సినిమా పోరాడుతోంది. ప్రీమియర్స్ + తొలిరోజు కలెక్షన్స్ కలిపి 35k డాలర్లు (భారత కరెన్సీలో 31.69 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన దేశాల నుంచి రోషన్ కనకాల మూవీకి మరో 25 లక్షల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవర్సీస్‌లో తొలిరోజు 55 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టాడు రోషన్ కనకాల. రెండో రోజు ఆదివారం కావడంతో ఉదయం నుంచి మంచి బుకింగ్స్ నమోదవుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మోగ్లీకి నార్త్ అమెరికాలో 15k డాలర్లు ( భారత కరెన్సీలో 13.5 లక్షల రూపాయలు) రాబట్టినట్లుగా తెలుస్తోంది.
మోగ్లీ రెండో రోజు కలెక్షన్స్
తొలిరోజు వచ్చిన ఊపుతో రెండో రోజు కూడా తమ సినిమా సత్తా చాటుతుందని మోగ్లీ యూనిట్ ఆకాంక్షిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు రోషన్ కనకాల మూవీకి 19 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. చాలా ఏరియాలలో మోగ్లీ బుకింగ్స్ పడిపోయినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండో రోజు మోగ్లీ మూవీకి ఇండియాలో 11 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్‌ను బట్టి కలెక్షన్స్ ఆధారపడి ఉంది. అయితే రెండో రోజు మోగ్లీకి వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల లోపు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రెండ్రోజుల్లో ఈ సినిమా 2 కోట్ల రూపాయల మార్క్ చేరుకోవచ్చని భావిస్తున్నారు. మరి ఇంతటి టఫ్ ఫైట్‌లో రోషన్ కనకాల ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











