Mowgli Day 3 Collections: దారుణంగా పడిపోయిన మోగ్లీ కలెక్షన్స్... రోషన్ కనకాల మూవీకి నష్టాలు తప్పాలంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు, మౌనిక తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సుహాస్, రియా సుమన్‌లు అతిథి పాత్రలో అలరించారు. ఎం ఎం కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీత దర్శకత్వం వహించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు. రమా మారుతి సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 13న మోగ్లీ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోగ్లీ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు రోషన్ కనకాల చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
మోగ్లీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మోగ్లీ సినిమా 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో రోషన్ కనకాల చిత్రంపై చిత్రసీమలో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 కోట్ల రూపాయల షేర్.. 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మోగ్లీ 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
మోగ్లీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో తొలిరోజున ఇండియా వైడ్‌గా 75 లక్షల రూపాయలు, రెండో రోజు 70 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 1.45 కోట్ల రూపాయల నెట్... 1.70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... ఆదివారం వరకు రోషన్ కనకాల మూవీ నార్త్ అమెరికాలో 50K డాలర్లు (భారత కరెన్సీలో 45.35 లక్షల రూపాయలు) వసూలు చేసింది. అయితే సోమవారం నుంచి మోగ్లీ నార్త్ అమెరికాలో పూర్తిగా డౌన్ అయ్యింది.
మూడో రోజు సాయంత్రం 8 గంటల వరకు నార్త్ అమెరికాలో మోగ్లీకి 8K డాలర్లు ( భారత కరెన్సీలో 7.25 లక్షల రూపాయలు) మాత్రమే వసూలైంది. ఈరోజు రాత్రి గడిస్తే కానీ అక్కడ ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలియనుంది. అమెరికా, కెనడాలో ప్రస్తుతం అఖండ 2, దురంధర్ సినిమాల హల్‌చల్ కొనసాగుతోంది. ఈ రెండు చిత్రాలను దాటుకుని మోగ్లీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని రెండు రోజుల వరకు మోగ్లీ చిత్రం 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
మోగ్లీ మూడో రోజు కలెక్షన్స్
పెద్ద సినిమాల మధ్యలో రిలీజైన మోగ్లీ చిత్రం.. వీకెండ్ వరకు బాగానే హోల్డ్ చేసింది. అయితే సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో ఈ చిన్న చిత్రం పూర్తిగా చేతులెత్తేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిక్స్‌డ్ టాక్, వర్కింగ్ డే ఎఫెక్ట్‌తో మోగ్లీకి సోమవారం బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. మూడో రోజు రాత్రి 8 గంటల వరకు మోగ్లీ సినిమాకు 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 171 షోలు, విజయవాడో 33 షోలు, విశాఖపట్నంలో 60 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు వెల్లడించింది. మూడో రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 40 లక్షల రూపాయల రేంజ్‌లో గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో మోగ్లీ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3.20 కోట్ల రూపాయల కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. రోషన్ కనకాల మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 3 కోట్ల రూపాయల షేర్.. 6.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది


Click it and Unblock the Notifications











