twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ ల మణిహారం..ఈ వారం(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    Masth
    ఈ వారం ఆరు చిత్రాలు టాలీవుడ్ భాక్సాఫీస్ ని పలకరించాయి. అయితే ఒక్క సినిమా కూడా తన ప్రభావాన్ని చూపలేక పోయింది. అన్ని నాసి కథలు, మ్రెక్కుబడి టేకింగ్ తో వెళ్ళిన కొద్దిమందిని తీవ్రస్ధాయిలో నిరాశపరిచాయి. అవి కృష్ణారెడ్డి మస్త్, ఢీ అంటే ఢీ, ష్..ఇది చాలా మంచి ఊరు, నల్లబ్బాయ్-తెల్లమ్మాయి, మిస్టర్ గిరీశం, దాదాగిరి.

    శివాజి, శివబాలాజి, అంచల్, సునీల్ వంటి వారితో వచ్చిన మస్త్ సినిమాని జీ మోషన్ పిక్చర్స్ వారు తొలి ప్రయత్నంగా నిర్మించారు. యస్వీ కృష్ణా రెడ్డి కూడా చిరకాల విరామం తర్వాత ఈ కామిడీని సినిమాని డైరక్ట్ చేసారు. టామ్,డిక్ అండ్ హ్యారీ అనే హిందీ చిత్రం ప్రీమేక్ గా ఈ చిత్రం వచ్చింది. ఫలితం కొన్ని ధియోటర్స్ లో రిలీజైన రోజు సాయింత్రానికే తీసేసారు.

    సాయికుమార్, ఆశిష్ విధ్యార్ధి, జయప్రకాష్ రెడ్డి, అజయ్ వంటివారు నటించిన ఢీ అంటే ఢీ మరో మూస పోలీస్ స్టోరీగా ముద్ర వేసుకుని టార్గెట్ అయిన మాస్ ప్రేక్షకులను కూడా ఆకర్షించలేకపోయింది.సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తే..సీనియర్ దర్శకుడు సాయి ప్రకాష్ డైరక్ట్ చేసారు.

    అలాగే ష్...ఇది చాలా మంచి ఊరు సినిమాని గతంలో కమ్లి చిత్రాన్ని నిర్మించిన హరిచరణ ప్రసాద్ దర్శకుడుగా మారి డైరక్ట్ చేసారు. హర్రర్,ధ్రిల్లర్ లక్షణాలు కల ఈ సినిమాలో షఫి,నచ్చావులే ఫేమ్ మాధవిలత ప్రధాన పాత్రల్లో చేసారు. పి.వి.సుకన్య నిర్మించిన ఈ చిత్రం కూడా సహన పరీక్షగా మారిందని అంటున్నారు. టైటిల్ చూసి ఓ వెరైటీ చిత్రమని ధియోటర్లో కి దూకిన కొద్ది మంది...ఓ సాదా సీదా దయ్యం..తను బ్రతికుండగా జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పి, విలన్స్ పై పగ తీర్చుకునే కథని చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

    ఇక కృష్ణభగవనా, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో కన్యాశుల్కంలోని గిరీశం క్యారెక్టర్ బేస్ చేసుకుని తీసిన మిస్టర్ గిరీశం ఓ స్టేజి డ్రామా కన్నా ఘోరంగా ఉండి ప్రేక్షకాదరణ పొందలేక పోతోంది. ఓడియన్ డీలక్స్ వంటి ధియోటర్స్ లో రిలీజైన మూడవరోజునే జనం లేక వేరే సినిమాలు వేసుకున్నారు. కామిడీ పేరుతో పాపులర్ క్యారెక్టర్స్ ని అపహాస్యం చేయటాన్ని దర్శకుడు పూర్ టేస్ట్ ని చాలా మంది విమర్శిస్తున్నారు.

    చివరగా నల్లబ్బాయ్..తెల్లమ్మాయ్ అనే పేరుతో వచ్చిన ఈ సినిమా పవన్, శ్రావణి అనే ఇద్దరు కొత్త వాళ్ళను పరిచయం చేస్తూ..మరో అవగాహన లేని దర్శకుడు నానికృష్ణని ముందుకు తీసుకొచ్చింది. బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం గొప్పదనే చెప్తూ వచ్చిన ఈ సినిమా ఎవర్ని ఆకట్టుకోలేకపోతోంది. ఇక గతవారం రిలీజైన అరుంధతి కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ సునామిలా చుట్టముడుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X