twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 డేస్ కలెక్షన్: ‘మిస్టర్ మజ్ను’ పరిస్థితి ఎలా ఉందంటే..

    |

    అఖిల్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ మజ్ను' రెండో రోజు కూడా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.

    శనివారం రిపబ్లిక్ డే హాలిడే అయినప్పటికీ... వసూళ్లు మరింత క్షీణించాయి. కేవలం రూ. 2.58 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓపెనింగ్సే ఇంత దారుణంగా ఉండటంతో బాక్సాఫీసు వద్ద మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో? అనే ఆందోళన డిస్ట్రిబ్యూటర్లో మొదలైంది.

    2 డేస్ టోటల్ ఎంత?

    2 డేస్ టోటల్ ఎంత?

    తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3 కోట్ల షేర్ సాధించిన ‘మిస్టర్ మజ్ను'... రెండో రోజు రూ. 2.58 కోట్ల షేర్ రాబట్టడంతో రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణ టోటల్ షేర్ రూ. 5.58 కోట్లకు రీచ్ అయింది.

    సినిమా ఎంతకు అమ్మారు?

    సినిమా ఎంతకు అమ్మారు?

    ‘మిస్టర్ మజ్ను' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.35 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. ఫస్ట్ వీకెండ్ కనీసం సగం (దాదాపు రూ. 8.5 కోట్ల) షేర్ రీకవరీ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

    ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా

    ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా

    ‘మిస్టర్ మజ్ను' చిత్రం ఓవర్సీస్ రైట్స్ రూ. 3.70 కోట్లకు అమ్మినట్లు సమాచారం. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 1.50 కోట్లకు అమ్మారు. ఇక్కడ కూడా సినిమా పరిస్థితి దారుణంగానే ఉందని తెలుస్తోంది.

    ఓవర్సీస్ కలెక్షన్

    ఓవర్సీస్ కలెక్షన్

    ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలతో కలిపి రెండు రోజుల్లో $174,320 రాబట్టింది. 120 లొకేషన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. నెగెటివ్ టాక్ కారణంగా సినిమా వసూళ్లు రెండో రోజు మరింత క్షీణించాయి.

    English summary
    Mr. Majnu has a disappointing day two in Telugu States as the film has collected a distributor share of 2.58 cr taking 2 days total to 5.58 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X