Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిస్టర్ మజ్ను ఫస్ట్ డే కలెక్షన్లు.. డిస్కౌంట్లు పెట్టినా.. దారుణంగా నిరాశపరిచిన కలెక్షన్లు..
తొలి ప్రేమ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రానికి యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా స్పందన కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు. గురువారం జనవరి 25న మిస్టర్ మజ్ను ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డాయి. అయితే గతంలో వచ్చిన అఖిల్ సినిమాలతో పోల్చితే వసూళ్లు ఆకర్షణీయమైన స్థాయిలో కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే..
అఖిల్ తొలి రెండు చిత్రాలకు
అఖిల్ మొదటి చిత్రం అఖిల్: పవర్ ఆఫ్ జువా, హల్లో సినిమాల ప్రీమియర్లకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద డిసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత సినీ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరచడంతో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాపై భారీగా అంచనాలు కనిపించాయి. అయితే అంచనాల భిన్నంగా ప్రీమియర్ వసూళ్లు నమోదయ్యాయి.
మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ అండ్ రేటింగ్
భారీగా డిస్కౌంట్ ఆఫర్లు
యూఎస్ థియేట్రికల్ హక్కులను సరిగమ సినిమాస్ పొందింది. పెద్దలకు 14 డాలర్లు, పిల్లలకు 9 డాలర్లు టికెట్ ధరను నిర్ణయించారు. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలతో పోల్చితే ఈ సినిమా టికెట్ ధర చాలా తక్కవు. డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చినప్పటికీ సినిమాకు ప్రేక్షకాదరణ కరువైందనే మాట వినిపిస్తున్నది.
ఫస్ట్ ప్రీమియర్ వసూళ్లు
యూఎస్‌లో మిస్టర్ మజ్ను చిత్ర ప్రీమియర్లను 131 లోకేషన్లలో ప్రదర్శించారు. కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్ షోల ద్వారా 59,633 డాలర్లు వసూలు చేసింది. అయితే కలెక్షన్లను బట్టి చూస్తే సినిమాపై పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారాంతంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయి.
ఆ రెండు చిత్రాల కంటే
గతంలో అఖిల్ నటించిన అఖిల్ చిత్రం 117 స్కీన్లలో 90 వేల డాలర్లు వసూళ్లు చేసింది. సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో మొత్తంగా 168544 డాలర్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అఖిల్ రెండో సినిమా హలో భారీగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రీమియర్లు 140 లొకేషన్లలో ప్రదర్శించగా, యూఎస్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో 210840 డాలర్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ల కలెక్షన్లను మిస్టర్ మజ్ను రాబట్టలేకపోయింది.