For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిస్టర్ మజ్ను ఫస్ట్ డే కలెక్షన్లు.. డిస్కౌంట్లు పెట్టినా.. దారుణంగా నిరాశపరిచిన కలెక్షన్లు..

|

తొలి ప్రేమ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రానికి యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా స్పందన కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు. గురువారం జనవరి 25న మిస్టర్ మజ్ను ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డాయి. అయితే గతంలో వచ్చిన అఖిల్ సినిమాలతో పోల్చితే వసూళ్లు ఆకర్షణీయమైన స్థాయిలో కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే..

అఖిల్ తొలి రెండు చిత్రాలకు

అఖిల్ తొలి రెండు చిత్రాలకు

అఖిల్ మొదటి చిత్రం అఖిల్: పవర్ ఆఫ్ జువా, హల్లో సినిమాల ప్రీమియర్లకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద డిసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత సినీ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరచడంతో కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాపై భారీగా అంచనాలు కనిపించాయి. అయితే అంచనాల భిన్నంగా ప్రీమియర్ వసూళ్లు నమోదయ్యాయి.

మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ అండ్ రేటింగ్

భారీగా డిస్కౌంట్ ఆఫర్లు

భారీగా డిస్కౌంట్ ఆఫర్లు

యూఎస్ థియేట్రికల్ హక్కులను సరిగమ సినిమాస్ పొందింది. పెద్దలకు 14 డాలర్లు, పిల్లలకు 9 డాలర్లు టికెట్ ధరను నిర్ణయించారు. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలతో పోల్చితే ఈ సినిమా టికెట్ ధర చాలా తక్కవు. డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చినప్పటికీ సినిమాకు ప్రేక్షకాదరణ కరువైందనే మాట వినిపిస్తున్నది.

ఫస్ట్ ప్రీమియర్ వసూళ్లు

ఫస్ట్ ప్రీమియర్ వసూళ్లు

యూఎస్‌లో మిస్టర్ మజ్ను చిత్ర ప్రీమియర్లను 131 లోకేషన్లలో ప్రదర్శించారు. కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్ షోల ద్వారా 59,633 డాలర్లు వసూలు చేసింది. అయితే కలెక్షన్లను బట్టి చూస్తే సినిమాపై పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వారాంతంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయి.

ఆ రెండు చిత్రాల కంటే

ఆ రెండు చిత్రాల కంటే

గతంలో అఖిల్ నటించిన అఖిల్ చిత్రం 117 స్కీన్లలో 90 వేల డాలర్లు వసూళ్లు చేసింది. సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో మొత్తంగా 168544 డాలర్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అఖిల్ రెండో సినిమా హలో భారీగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రీమియర్లు 140 లొకేషన్లలో ప్రదర్శించగా, యూఎస్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో 210840 డాలర్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాల ప్రీమియర్ల కలెక్షన్లను మిస్టర్ మజ్ను రాబట్టలేకపోయింది.

English summary
Young Tiger NTR attended for Mr Majnu pre release event as Chief guest. This movie set to release on January 25th. Mr Majnu has opened to an average response and collected $59,633 from 131 locations at the US box office in its premiere shows.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more