Mr & Mrs Mahi Collections దుమ్మురేపుతున్న జాన్వీ కపూర్ మూవీ.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్, జీ స్టూడియోస్, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి. సెన్సేషనల్ హీరోయిన్ జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా, రాజేశ్ శర్మ, కుము్ మిశ్రా, జరీనా వాహెబ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు (Mr. & Mrs. Mahi Collections) సాధిస్తున్న ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ తదితర అంశాల విషయాల్లోకి వెళితే..

మహింద్ర అగర్వాల్ అలియాస్ మహి (రాజ్ కుమార్ రావు) ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. తన ఇష్టానికి వ్యతిరేకంగా క్రికెట్‌ను వదిలేసి డాక్టర్‌గా మారిన మహిమా అగర్వాల్ అలియాస్ మహి (జాన్వీకపూర్) ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. క్రికెట్‌లో ఇండియా టీమ్‌కు ఆడలేకపోవడానికి గల భర్త వైఫల్యాలను తెలుసుకొన్న మహి..ఆయనను ప్రోత్సాహించే ప్రయత్నం చేస్తుంది. కానీ సఫలం కావు. అయితే తన భార్యలో గొప్ప క్రికెటర్ ఉన్నారనే విషయం గ్రహించిన మహి.. ఆమెను తిరిగి క్రికెట్ ఆడేలా చేస్తాడు. భార్య, భర్తల మధ్య గొలు, ఇతర అనేక ప్రతికూలతల మధ్య మహి జాతీయ జట్టుకు ఎలా ఎంపికైందనేది సినిమా కథ.

Mr amp amp Mrs Mahi Expected Box Office Collections Worldwide Janhvi Kapoor movie study at GBOC

క్రికెట్ నేపథ్యంగా తెరకెక్కిన మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr. & Mrs. Mahi) సినిమాలో అతి తక్కువ మంది నటీనటులతో పరిమితమైన లొకేషన్లలో మూవీని చిత్రీకరించారు. అయితే క్రికెట్ షూట్‌కు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. దాంతో జాన్వీ, రాజ్ కుమార్ రావు, ఇతర నటీనటుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమాను 40 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 50 కోట్లతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr. & Mrs. Mahi) సినిమా టీజర్లు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగేలా చేశాయి. దాంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో విడుదల చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr. & Mrs. Mahi) సినిమాకు జైపూర్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కత్తా తదితర ప్రధాన నగరాల్లో భారీ ఆక్యుపెన్సీ కనిపిస్తున్నది. ఈ సినిమా వీకెండ్‌లో భారీ స్పందన ఉండగా, వర్కింగ్ డేస్‌లో అంతంత మాత్రంగానే ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నది.

Mr amp amp Mrs Mahi Expected Box Office Collections Worldwide Janhvi Kapoor movie study at GBOC

అయితే తొలి రోజు జాన్వీ కపూర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని 99 రూపాయలకే చూపించడంతో తొలి రోజు 7 కోట్ల రూపాయలు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇక రెండో రోజు ఈ సినిమా 5 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసింది. ఇక మూడో రోజు ఈ సినిమా 6 కోట్ల రూపాయలను రాబట్టింది.

గత మూడు రోజుల్లో మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr. & Mrs. Mahi) చిత్రం సుమారుగా 17 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన హిందీ సినిమాల కలెక్షన్ల కంటే బెటర్‌గా ఉండటం కొంత ఊరటగానే చెప్పుకోవాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 50 కోట్ల వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X