రాణా సినిమా ఫ్లాఫ్..ప్రభాస్ సినిమా హిట్ (ట్రేడ్ టాక్)
ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ కాంబినేషన్ లో దశరథ్ రూపొందించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్" చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'దిల్"రాజు నిర్మించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మొదట యావరేజ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత హిట్ గా సెటిలైంది. దానికి తోడు దిల్ రాజు మొదలెట్టిన పబ్లిసిటి సినిమాకు కొంత అంచనాలను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన ఓపినింగ్స్ ఈ సినిమాకు ప్లస్ గా మారాయి. ఇక ఈ చిత్రంతో పాటు బాలాదిత్య, రూపాశ్రీ జంటగా వివివి సత్యనారాయణ దర్శకత్వంలో లక్ష్మీనారాయణ డొల్లా నిర్మించిన 'నిన్ను చేరాలని" కూడా విడుదలయింది. అయితే బాలాదిత్య హీరోగా చేసిన 'నిన్ను చేరాలని" చిత్రం మాత్రం ప్రేక్షకులను చేరలేకపోయింది. ఈ రెండు చిత్రాలతో పాటు మరో బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్" ప్రేక్షకుల ముందుకొచ్చింది. లీడర్ తో తెలుగు తెరకు పరిచయమైన రాణా హీరోగా చేసిన ఈ ధ్రిల్లర్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలకపోయింది. నెగిటివ్ రివ్యూలతో, మౌత్ టాక్ తో మొదటి రెండు రోజులకే ధియోటర్స్ ఖాళీ అయ్యాయి. దీపికా పదుకోని ఐటం సాంగ్ కూడా సినిమాను ఏ మాత్రం నిలబెట్టలేకపోయింది.


Click it and Unblock the Notifications











