Mr Pregnant Collections సోహెల్ మూవీ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి? హిట్టా? ఫట్టా?
బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ యువ హీరో సయ్యద్ సోహైల్ ర్యాన్ నటించిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. మలయాళ నటి రూపా కొడుయావుర్, సుహాసిని మణిరత్నం, రాజా రవీంద్ర తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి ప్రొడక్షన్స్ నిర్మించింది. శ్రీనివాస్ వింజనమపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. ఆగస్టు 18వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. గౌతమ్ అనే టాటూ ఆర్టిస్ట్ ప్రేమ అంటే దూరంగా ఉంటాడు. కానీ మహీ అనే అమ్మాయి వెంటపడుతుంది. పలుమార్లు ఆమె ప్రేమను నిరాకరించినా.. చివరకు పెద్దలను ఎదిరించి మహీని వివాహం చేసుకొంటాడు. మహీ గర్బం దాల్చడంతో ఆందోళన చెందుతాడు. చివరకు ఆమె గర్బాన్ని తన గర్బంలో పెట్టుకొని బిడ్డకు జన్మనివ్వాలని అనుకొంటాడు. గౌతమ్ గర్బం దాల్చిన తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.

మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆరంభంలో స్క్రీన్ కౌంట్ తక్కువైనప్పటికీ.. ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ రావడంతో స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు. ఈ సినిమా గత మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్సాన్స్ చూపించింది.
మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. గత మూడు రోజుల్లో యావరేజ్ తీసుకొంటే.. మార్నింగ్ షోకు 25 శాతం, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. ఈ చిత్రం తొలి రోజు 35 లక్షలు నమోదు చేసింది. రెండో రోజు ఈ సినిమా 40 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు ఈ సినిమా 45 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. తొలి రోజు కంటే రెండో, మూడో రోజు ఎక్కువ కలెక్షన్లును సాధించడం పాజిటివ్ అంశంగా మారింది. ఇక నాలుగో రోజు ఈ సినిమా 20 లక్షల రూపాయలు దాంతో ఈ చిత్రం 1.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 1.4 కోట్లు నమోదు చేసింది.
ఇక మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ 4, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా కలెక్షన్లు సాధిస్తున్నది. మౌత్ టాక్ పెరగడం వల్ల నిలకడగా వసూళ్లు నమోదు చేస్తున్నది. ఈ సినిమా 5వ రోజు 18 లక్షలు రాబట్టింది.

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. కమీషన్ బేస్ట్ మీద మైత్రీ మూవీస్ విడుదల చేసినట్టు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 2.5 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 2.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











