Mrithyunjay Closing Collections: మృత్యుంజయ్ క్లోజింగ్ కలెక్షన్స్.. శ్రీవిష్ణు మూవీకి లాభమెంత? నష్టమెంత?

లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన చిత్రం మృత్యుంజయ్. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు, మలయాళ బ్యూటీ రెబ్బా మోనిక హీరో హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రల్లో రచ్చ రవి, సిజ్జు, మిర్చి మాధవి, సుదర్శన్, కృష్ణ కౌశిక్ తదితరులు నటించారు. ఆస్కార్ ఆవార్డ్ విజేత ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన మృత్యుంజయ్ చిత్రం మార్చి 6న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? మృత్యుంజయ్ మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

మృత్యుంజయ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మృత్యుంజయ్ మూవీకి 14 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లతో పాటు శ్రీవిష్ణు క్రేజ్ కారణంగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ సినిమా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Mrithyunjay Box Office Collections Worldwide SreeVishnu s film Closing Collections at Global Box Office Report

మృత్యుంజయ్ ప్రీ రిలీజ్ బిజినెస్
మృత్యుంజయ్ మూవీకి నైజాం థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 40 లక్షల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 2.2 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయల చొప్పున ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా మృత్యుంజయ్ మూవీకి 6 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 6.5 కోట్ల రూపాయల షేర్.. 13 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మృత్యుంజయ్ కలెక్షన్స్
మృత్యుంజయ్ మూవీకి తొలిరోజున 2.50 కోట్ల రూపాయలు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 65 లక్షల రూపాయలు, ఐదో రోజున 55 లక్షల రూపాయలు, ఆరో రోజున 40 లక్షల రూపాయలు, ఏడో రోజున 35 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 34 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 55 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. తద్వారా ఇండియాలో 9 కోట్ల రూపాయల నెట్.. 9.34 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లోనూ శ్రీవిష్ణు మూవీకి మంచి వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలో శ్రీవిష్ణు మూవీకి 150K డాలర్లు (భారత కరెన్సీలో 1.40 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. దాంతో భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు.

మృత్యుంజయ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో వచ్చినప్పటికీ శ్రీవిష్ణు మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. వీకెండ్‌లో తిరుగులేని ఆక్యూపెన్సీతో మంచి వసూళ్లను రాబట్టింది మృత్యుంజయ్. అయితే సోమవారం నుంచి వర్కింగ్ డేస్‌కి తోడు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ కావడంతో కొంచెం వసూళ్లు తగ్గినప్పటికీ.. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆదరణ లభించింది. థియేటర్‌లో ఎలాంటి పోటీ లేకపోవడంతో వీకెండ్‌లో మరోసారి సత్తా చాటుతోంది మృత్యుంజయ్.

మృత్యుంజయ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అలాగే 6.5 కోట్ల రూపాయల షేర్‌కు 5.5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో పాటు మార్చి 18 వరకు ఈ సినిమాకు పోటీ వచ్చే మరో సినిమా థియేటర్‌లలో లేకపోవడంతో అప్పటికీ మృత్యుంజయ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ కొట్టేస్తుందని అంటున్నారు. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్, డబ్బింగ్ రైట్స్‌తో ఇప్పటికే నిర్మాతలు లాభాల్లోకి వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X