Sita ramam day 1 collections బ్లాక్ బస్టర్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన చిత్రం సీతారామం.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, ఓపెనింగ్ కలెక్షన్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

హిందూ, ముస్లిం ప్రేమకథగా

హిందూ, ముస్లిం ప్రేమకథగా


హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ కథగా, మిలిటరీ నేపథ్యంగా దేశభక్తిని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్‌ టాక్ పాజిటివ్‌గా రావడం, సినీ క్రిటిక్స్ అంతా భారీగా రేటింగ్స్ ఇవ్వడంతో మంచి ఓపెన్సింగ్ వచ్చాయి. సాయంత్రానికి కల్లా ఏకపక్షమైన టాక్‌తో బ్లాక్ బస్టర్ టాక్‌తో ఘనంగా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

తొలి రోజు భారీ స్పందన

తొలి రోజు భారీ స్పందన


సీతారామం సినిమాకు భారీ స్పందన హైదరాబాద్ నగరంలో కనిపించింది. మొత్తంగా 316 షోలు ప్రదర్శించగా తొలి రోజు 47 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాదాపు 26 శాతం అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఇక రెండో రోజుకు కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడం గమనార్హం.

యూఎస్‌లో తొలి రోజు

యూఎస్‌లో తొలి రోజు


అమెరికాలో కూడా సీతారామం సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను 227 లొకేషన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా ప్రీమియర్ల రూపంలో 90K డాలర్లు, తొలి రోజు కలెక్షన్లతో కలిపి 100k వసూళ్లను సాధించింది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా

తొలి రోజు కలెక్షన్ల అంచనా


సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజున 5 కోట్లకుపైగా గ్రాస్, 3 కోట్లకుపైగా షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇంకా రెస్పాన్స్ మరింత పాజిటివ్‌గా ఉంటే..ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్


సీతారామం సినిమా నైజాంలో అత్యధికంగా 5 కోట్లు, సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సీతా రామం సినిమా 14 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 70 లక్షలు, ఓవర్సీస్ 2.5 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19.50 కోట్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే?

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే?


సీతారామం సినిమాకు ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం తొలి వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఇటీవల కాలంలో క్లీన్ హిట్ సొంతం చేసుకొన్న చిత్రంగా రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X