ఎమ్.ఎస్.రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'మస్కా' చిత్రాన్ని ఆంద్రప్రదేశ్ అంతటా సొంత రిలీజు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సురేష్ బాబు ఈ చిత్రం ప్రివ్యూ చూసి ఎంతో ఇంప్రెస్ అయి ఈ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా మనసంతా నువ్వే సినిమాకు కూడా సురేష్ బాబు సొంత రిలీజు సూచన చేసారు.అయితే అప్పటి పరిస్థితుల్లో ఎమ్.ఎస్.రాజు ఆ ప్రకారం చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయనే స్వంతంగా రిలీజు ప్లాన్ తో ఆయనకు ఆ చిత్రం హిట్ పై ఉన్న ధీమా వ్యక్తం అవుతుందంటున్నారు. భారీ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్,హన్సిక,షీలా నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.