Mufasa: The Lion King Collections: 1700 కోట్ల బడ్జెట్.. మహేష్ మూవీకి రికార్డు కలెక్షన్లు!
హాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఫ్రాంచైజీ లయన్ కింగ్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ముఫాసా: ది లయన్ కింగ్. 2019లో వచ్చిన లయన్ కింగ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. హిందీ వెర్షన్‌కు షారుక్ ఖాన్, తెలుగు వెర్షన్‌కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా 13 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు బ్యారీ జెన్‌కిన్స్ దర్వకత్వంలో వాల్ట్ డిస్నీ పిక్చర్స్ ఈ మూవీని 1725 కోట్ల రూపాయలతో నిర్మించారు. హాలీవుడ్‌లో ఆరోన్ పియరే, కెల్విన్ హారిసన్, సెథ్ బూన్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ యానిమేటేడ్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇక ఇండియాలో ఈ సినిమాకు పుష్ప 2 సినిమా దూకుడుకు అడ్డుకొని భారీగా వసూళ్లను సాధించింది. తొలి రోజు నుంచే ఇటీవల కాలంలో ఏ హాలీవుడ్ మూవీ సాధించని విధంగా కలెక్షన్లు సాధించింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు 7 కోట్ల రూపాయలు, రెండో రోజు 11 కోట్ల రూపాయలు, 3వ రోజు 17 కోట్లు, 4వ రోజు 6 కోట్లు, 5వ రోజు 7 కోట్లు, 6వ రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలివారంలోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయలు రాబట్టింది.
తొలివారం తర్వాత కూడా ముఫాసా లయన్ కింగ్ చిత్రం భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. 7వ రోజు 6 కోట్ల రూపాయలు, 8వ రోజు 6 కోట్లు, 9వ రోజు 8 కోట్లు, 10వ రోజు 12 కోట్లు, 11వ రోజు 5 కోట్లు, 12వ రోజు 5 కోట్లు, 13వ రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. మొత్తంగా ఈ సినిమా 122 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ 42 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 43 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 16 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగితా భాషలు కలుపుకొని ఈ సినిమా 125 కోట్లకు చేరువైంది.
నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అమెరికా, కెనడాలో కలిపి ఈ చిత్రం 135 మిలియన్ డాలర్లు అంటే 1150 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 225 మిలియన్ డాలర్లు అంటే 2000 కోట్ల రూపాయలు రాబట్టింది. క్రిస్మస్ హాలీడేస్ కొనసాగుతున్న క్రమంలో ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











