4800 కోట్ల కలెక్షన్లు.. ఎన్నివేల కోట్ల లాభమంటే? మహేష్ బాబు మ్యాజిక్ వర్కవుట్ అయిందా?

హాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకదారణ ఉన్న సీక్వెల్‌‌లో ది లయన్ కింగ్ ఒకటి. 2019లో వచ్చిన లయన్ కింగ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ముఫాసా: ది లయన్ కింగ్ క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమాకు హిందీ, తెలుగు వెర్షన్‌కు ఇండియన్ సూపర్ స్టార్స్ అంతా పనిచేయడం వల్ల భారీ క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇండియాలోని ప్రధాన నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎన్ని దేశాల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమాకు థియేట్రికల్ రన్‌లో వచ్చిన టోటల్ కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భారతీయ భాషల్లో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్‌కు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటానికి కారణమైంది. దాంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడానికి అవకాశం ఏర్పడింది.

Mufasa The Lion King Box Office Total Collections Worldwide Mahesh Babu Shah Rukh Khan magic witness in Indian Box Office

అత్యంత సాంకేతికతో రూపొందిన యానిమేషన్ ఈ సినిమాకు హాలీవుడ్‌లో ఆరోన్ పియరే, కెల్విన్ హారిసన్, సెథ్ బూన్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ యానిమేటేడ్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. టాప్ యాక్టర్లందరూ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బ్యారీ జెన్‌కిన్స్ దర్వకత్వంలో వాల్ట్ డిస్నీ పిక్చర్స్ ఈ మూవీని 1725 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు ఇండియాలోనే కాకుండా యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లో భారీగా ఓపెనింగ్స్ సాధించింది.అలాగే నార్త్ అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో మంచి కలెక్షన్లు సాధించింది. తొలివారాంతంలో ఈ చిత్రం 135 మిలియన్ డాలర్లు అంటే 1150 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 225 మిలియన్ డాలర్లు అంటే 2000 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇండియాలో భారీగా వసూళ్లను సాధించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్‌లో ఈ సినిమా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 135 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. 2024, 2025లో ఓ హాలీవుడ్ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక థియేట్రికల్ రన్‌లో ముఫాసా చిత్రం యూకే, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో కలిపి మొత్తంగా 3100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక అమెరికా, కెనడాలతో కలిపి ఈ మూవీ సుమారుగా 4800 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేసింది. ఈ సినిమా నిర్మాతలకు భారీగా లాభాలను సంపాదించి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X