»   »  నితిన్,నాని క్రేజీ చిత్రాలు...మల్టి డైమన్షన్ చేతికి

నితిన్,నాని క్రేజీ చిత్రాలు...మల్టి డైమన్షన్ చేతికి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ బాడీగార్డ్ ,లారెన్స్ కాంచన చిత్రాలతో బెల్లంకొండ సురేష్ తో కలిసి ప్రొడక్షన్ లోకి ఎంటరైన మల్టి డైమన్షన్ వారు...మీడియం, లో బడ్జెట్ సినిమాలను సొంతంగా విడుదల చేయటానికి వరసగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటున్నారు. వీరికి థియోటర్స్ ఉండటంతో చాలా మంది ఈ సంస్ధను కలిసి తమ సినిమాలు తీసుకోమంటున్నారు.

తాజాగా ఈ సంస్ధ రెండు క్రేజీ చిత్రాలు సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా రెడీ అవుతున్న కొరియర్ బాయ్ కళ్యాణ్, నాని జెండాపై కపిరాజు చిత్రాలు రైట్స్ తీసుకున్నారు. అలాగే...సెంకడ్ హ్యాండ్, ప్రిన్స్ రెండు చిత్రాలు, సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం కూడా వీరే డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.


'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమాలో నితిన్ సరసన యామి గౌతం నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. హీరో, హీరొయిన్లు ఈ సినిమా తమకు, తమ కెరీర్ కు అదనపు బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రం యొక్క కధ వినుత్నమైనది కనుక నితిన్ ఈ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇలాంటి కధ ఇప్పటివరకూ ఇండియన్ సినిమా రంగంలో రాలేదని నితిన్ చెప్తున్నారు. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ సాయి ఈ సినిమాకు దర్శకుడు. గౌతం మీనన్ నిర్మాత. కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. తమిళ, తెలుగు సినిమాలలో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. హీరో నాని మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

English summary
Multi Dimension Entertainments is one of the leading distribution houses in Andhra Pradesh. The lineup is very interesting. Nithin starrer Courier boy Kalyan will be released by this firm. They have also taken up other under production movies like Nani starrer Jenda Pai Kapiraju, Second Hand, 'Romance' fame Prince's two films, and director Suresh Krishna's new bilingual movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu