Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దొందూ దొందే..రెండూ చెత్తే (ట్రేడ్ టాక్)
ఎప్పటిలాగే ఈ వారం కూడా పసలేని చిత్రాలతో పూర్తి స్ధాయిలో నిరాశపరిచింది. ముమైత్ ఖాన్ టార్గెట్, శివాజి..18,20 లవ్ స్టోరి చిత్రాలు ఈ వారం రిలీజయ్యాయి.రెండు చిత్రాలు ఒకే రకమైన నీచమైన కలెక్షన్స్ తో దొందూ దొందే అనిపించుకున్నాయి. బేసిక్ ఇనిస్టెంట్ ఆధారంగా వచ్చిన టార్గెట్ ని బి, సి సెంటర్లో వర్కువుట్ అవుతుందని టార్గెట్ చేసారు..కానీ రివర్స్ రిజల్టుతో దర్శక, నిర్మాతలను ట్విస్ట్ ఇచ్చింది. ముమైత్ ని ఇంకా ఎంత విప్పతీసి చూపించినా చూసే వాళ్ళు లేరని రిజల్ట్ వచ్చింది. పున్నమి నాగు రిజల్ట్ నే ఈ చిత్రమూ అనుసరించింది. ఇక అప్పట్లో సింధూర పువ్వు తరహాలో శివాజి ఓ ప్రేమ జంటకు అండగా నిలిచే కథతో 18,20 లవ్ స్టోరి చిత్రం వచ్చింది.
అయితే చిత్రంలో శివాజి ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరి ఎక్కువయి మొత్తం కథనాన్నే నీరు కార్చింది. ఇక శివాజి కూడా ఏమి చేసినా ఓపినింగ్స్ కూడా సంపాదించుకోలేక పోతున్నాడు. అందులోనూ వరసపెట్టి అతనికే సాధ్యమయ్యే నీరసమైన కథ,కథనాలు,హావభావాలుతో అతను సహనపరీక్ష పెట్టడం మానటం లేదు. అలాగే గత వారం రిలీజైన కిక్ ఇప్పటికీ స్టడీగా కలెక్షన్స్ సంపాదిస్తోంది. అలాగే భిల్లా చిత్రం బి, సి సెంటర్లను దాటిపోయి నిర్మాతకు, కొనుక్కున్న వారికి నీరసాన్ని మిగులుస్తోంది. ఇక ఈ రోజు(శుక్రవారం)రిలీజైన ప్రయాణం మల్టిఫ్లెక్స్ లు ఫిల్ అయ్యాయి.పిస్తాకు ఆ అదృష్టమూ దక్కలేదని రిపోర్టు. కామిడీ అని ప్రచారం చేసిన ఈ రెండు సినిమాలు అనుకున్న రేంజిలో లేవని ప్రాధమిక సమాచారం.