Munjya Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. మూడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హిందీ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన చిత్రం మంజ్యా. ఆదిత్య సర్పోత్‌దార్ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో శర్వారీ, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ లాంటి నటీనటులు కీలక పాత్రలను పోషించారు. జూన్ 7వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
మంజ్యా కథ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకోవాలనుకొన్న ఓ యువకుడు తన సొంత గ్రామానికి వెళ్లి తన ఫ్యామిలీలో పెళ్లికి ముందు జరిగే ఉపనయనానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెడుతాడు. దాంతో గ్రామస్థులు అతడిపై వ్యతిరేకించడంతో తనను తాను రక్షించుకోవాల్సి వస్తుంది. అయితే చివరకు ఆ యువకుడు పెళ్లి చేసుకొన్నాడా? పెల్లి చేసుకోవడానికి ఎలాంటి సాహసం చేశాడు అనేది సినిమా కథ. మరాఠీ భాషలో మంజ్యా అంటే ఉపనయనం అని అర్థం.

ఇక మంజ్యా సినిమాను కొత్త, పాత నటీనటుల మేళవింపులో రూపొందించారు.ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్, నటీనటులు పారితోషికం, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలిపి మొత్తంగా 30 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది.
మంజ్యా మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేట్రికల్ రిలీజై ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించిన భారీ కలెక్షన్లను రాబడుతున్నది. దాంతో ఈ సినిమా సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా గత మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యేంత వసూళ్లను రాబట్టింది.

ఇక గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ చిత్రం ఇండియావైడ్ 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు 7.25 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు ఈ సినిమా కలెక్షన్ల హవాను కొనసాగిసత్ూ.. 7.75 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో సుమారుగా 19 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఇక నాలుగో రోజు కూడా బాక్సాఫీస్ రిపోర్టు పాజిటివ్‌గానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన కనిపిస్తున్నది. వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్లు కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ నిలకడగా ఈ సినిమా కలెక్షన్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నాలుగో రోజున ఈ సినిమా 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తునున్నారు.


Click it and Unblock the Notifications











