Murari 4k ఖుషి రికార్డును బ్రేక్ చేసిన మురారీ.. బాలయ్య, ఎన్టీఆర్‌ను కొట్టలేకపోయిన మహేష్!

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల గత చిత్రాల రీ రిలీజ్ పర్వంగా ఘనంగా సాగుతున్నది. రెగ్యులర్ రిలీజయ్యే కొత్త సినిమాల కంటే అగ్ర నటుల రీ రిలీజ్ చిత్రాలకు భారీగా కాసుల పంట పడుతుతున్నది. ఇప్పటికే పవన్ కల్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు విడుదలై భారీ కలెక్షన్లు సాధించాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారీ చిత్రం విడుదలై సంచలనం రేపింది. ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ డైరెక్షన్‌లో మహేష్ బాబు, సొనాలి బింద్రే జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎన్ రామలింగేశ్వరరావు నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను చేరువ చేసింది. పాటలు, ఎమోషన్స్ ఈ సినిమాకు అత్యంత బలంగా నిలవడంతో ఆడియెన్స్ భారీగా ఆదరించారు.

Murari 4K Movie 3 days Worldwide Collections Mahesh Babu beats Pawan Kalyan s Khushi Re release All time Records

అలాంటి కల్ట్ సినిమాగా మారిన మురారీని తాజాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు 5.4 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. రెండో రోజు అదే జోష్‌ను కొనసాగించింది. ఇక రెండో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో కేవలం రెండు రోజుల్లోనే 7.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక మూడో రోజు కూడా అదే ఊపును కొనసాగించడంతో రీ రిలీజ్ చిత్రాల్లో ఖుషీ సాధించిన కలెక్షన్లను అధిగమించింది. ఈ చిత్రం మూడో రోజున 1 కోటి రూపాయలు వసూలు చేయడంతో ఈ చిత్రం 3 రోజుల్లో 8.4 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా వసూలు చేసిన 7.8 కోట్ల రూపాయల కలెక్షన్లను అధిగమించింది.

Murari 4K Movie 3 days Worldwide Collections Mahesh Babu beats Pawan Kalyan s Khushi Re release All time Records

ఇదిలా ఉండగా, ఓవర్సీస్‌లో మురారీ సినిమా భారీగానే కలెక్షన్లు సాధించినప్పటికీ.. రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో సింహాద్రి, చెన్నకేశవరెడ్డి చిత్రాలు అమెరికాలో టాప్ గ్రాసర్స్‌గా నిలిచాయి. సింహాద్రి 58700 డాలర్లు వసూలు చేయగా.. చెన్న కేశవరెడ్డి 52000 డాలర్లు కలెక్ట్ చేసింది.

ఇక మురారీ4K (Murari4K) చిత్రం ఓవర్సీస్‌లో భారీగా వసూలు చేసింది. ఈ చిత్రం 50000 డాలర్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. అయితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో మహేష్ మూవీ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: murari4k murari mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X