Murari 4K Re Release Collection: రీ రిలీజ్‌లలో మహేశ్ డామినేషన్... మురారికి ఈసారి ఎన్ని కోట్లంటే?

చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న పోటీ, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా ఎలాంటి కాన్సెప్టులతో వచ్చిన సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కాలంటే కష్టంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పాత సినిమాల రీ రిలీజ్ కావడంతో పాటు భారీ వసూళ్లను అందిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో చిత్రాలు రీ ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని చిత్రాలు ఫస్ట్ రిలీజ్‌ను మించి కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన చిత్రమే 'మురారి'. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్‌గా ముద్ర వేసుకుంది. ఇప్పటికే ఒకసారి రీ రిలీజైన మురారి.. తాజాగా న్యూఇయర్ సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మురారి రీ రిలీజ్‌లో ఎన్ని కోట్లు రాబట్టింది? వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు ఆర్జించింది? ఈ వివరాలు పరిశీలిస్తే....

Murari 4K Re Release Collection Mahesh Babu s Classic Creates Sensation Again

రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్ దేవిప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపి నందిగంలు మురారి చిత్రాన్ని నిర్మించారు. మురారిలో సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించారు. లక్ష్మీ, సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతిరావు, అన్నపూర్ణ, సుధ, ప్రసాద్ బాబు, శివాజీ రాజా, చిన్నా, రఘు బాబు, రవిబాబు, హేమ, అనితా చౌదరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సీ రామ్‌ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణవంశీ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2001 ఫిబ్రవరి 17న మురారి విడుదలైంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మురారి సినిమాకు అప్పట్లో 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. వరల్డ్ వైడ్‌గా మురారి 13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ లభించింది. ఇక ఆ తర్వాత రీ రిలీజ్‌లలో మురారి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో మురారి ఆధునిక హంగులు, 4కే టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకొచ్చి చరిత్ర సృష్టించింది. తొలి రోజున 5.46 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన మురారి.. లాంగ్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా 9.12 కోట్ల రూపాయలు వసూలు చేసి రీ రిలీజ్‌లలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది మేలో ఖలేజా విడుదలయ్యే వరకు ఈ రికార్డ్ మురారి పేరిటే ఉంది.

తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని మురారిని మరోసారి 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వసూళ్లను పరిశీలిస్తే.. న్యూఇయర్ వైబ్‌‌తో పాటు మహేశ్ క్రేజ్ కారణంగా మురారికి మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాకు టికెట్ ధరను సింగిల్ స్క్రీన్స్‌లో 99 రూపాయలుగా, మల్టీప్లెక్స్‌లలో 105గా ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజుతో కలిపి మురారి ఇండియా వైడ్‌గా 85 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈసారి మురారి రీ రిలీజ్‌లో 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X