విజయ్ 'తుపాకి' రిలీజైంది ..రిజల్ట్
హైదరాబాద్ : ఇళయదళపతి విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కాంబినేషనల్ రూపొందిన మోస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ చిత్రం తుపాకీ. దీపావళి కానుకగా ఈ చిత్రం మంగళవారం లేటుగా విడుదల అయ్యింది. పైనాన్స్ సమస్యలతో ఈ చిత్రం మార్నింగ్ షోలు రిలీజ్ కాలేదు. అయితే సమస్య సాల్వ్ అయినా వెంటనే చాలా ధియోటర్స్ వద్ద బాక్స్ లు రాకపోవటంతో సినిమా రిలీజ్ కాలేదు అని బోర్డ్ పెట్టారు. అయితే శాటిలైట్ తో నడిచే ధియోటర్స్ లో మాత్రం విడుదల అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులో తొలిసారిగా హిట్ ని అందించింది. దీపావళికి తెలుగు స్టైయిట్ పెద్ద సినిమా ఏదీ రిలీజ్ కాకపోవటం ఈ సినిమా కలెక్షన్స్ కు ప్లస్ అయ్యే అవకాసం కనిపిస్తోంది.
ఈ చిత్రం కథలో.....జగదీష్ (విజయ్) ముంబైలోనే పుట్టి పెరుగుతాడు. అతని తండ్రి ఆర్మీ అధికారి. జీవితాన్ని ఎప్పుడూ సరదాగా గడపాలనుకొంటాడు జగదీష్. అతనూ ఆర్మీ కెప్టెన్ అవుతాడు. తన సెలవుల సమయంలో ఇంటికి వస్తాడు. అక్కడ అతనికి నిషా(కాజల్ )తో పెళ్లి సెటిల్ చేస్తారు. ఆ తర్వాత టెర్రరిస్ట్ లు ముంబైలో బాంబులు పేలుస్తారు. దాంతో అక్కడే ఉన్న జగదీష్..ఓ టెర్రరిస్టుని పట్టుకుని ఎంక్వైరీ ప్రారంభిస్తాడు. తర్వాత ఆ టెర్రరిస్టులు మరో పన్నెండు చోట్ల బాంబులు పెట్టడానికి ప్లాన్ చేసినట్లు తెలుసుకుంటాడు. ముంబై లో ఆ స్లీపర్ సెల్స్ ఎక్కడున్నారో కనుక్కుని వారి ప్లాన్ ని ఎలా ఛేదించి,సిటిని రక్షించాడనేది మిగతా కథ.
దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ.... తుపాకీ విషయంలో నేను తొలి నుంచి చెబుతున్న మాట ఒక్కటే. పూర్తిగా కమర్షియల్ ఫార్మెట్‌లో రూపొం దిన మాస్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 80, 90లో నటించిన చిత్రాల తరహాలో తుపాకీ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాను. ఈ చిత్రాన్ని స్నేహితులు, కుటుంబం, పిల్ల లు సహా కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఏ తరగతికి చెందిన వారు బోర్ ఫీల్‌కారు అన్నారు.


Click it and Unblock the Notifications











