NTR 30: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు భారీ రెమ్యునరేషన్.. కెరీర్ లోనే అత్యధికంగా..
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుగా సెట్స్ పైకి రానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ను ఫైనల్ చేశారు. ఇక అతనికి కెరీర్ లోనే ఈ సినిమాకు గాను అత్యధిక పారితోషికం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతనికి ఎంతో ఇస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..

అందుకే ఆలస్యం
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మరో భారీ విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక కొరటాల శివ తో అతను ఎప్పుడో మొదలు పెట్టాల్సిన సినిమా ను మొత్తానికి మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాడు. కథలో కొన్ని మార్పులు చేయడం వలన ఈ ప్రాజెక్టు షూటింగ్ కొంత ఆలస్యంగా మొదలవుతున్న విషయం తెలిసిందే. ఇక దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ముగిసిపోయాయి.

భారీగా రెమ్యునేషన్స్
ఎన్టీఆర్ 30వ సినిమాను కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు యువసుద ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పారితోషికాలు కూడా భారీ స్థాయిలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు హీరో ఇద్దరూ కూడా కేవలం పారితోషికం మాత్రమే కాకుండా లాభాల్లో వాటా కూడా అందుకు పోతున్నట్లు సమాచారం.

హీరోయిన్ ఎవరు?
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు. మొదట ఆలియా భట్ అని అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్లీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో మరొక హీరోయిన్ కోసం సంప్రదింపులు జరిపారు. ఇక ప్రస్తుతం అయితే జాన్వికపూర్ అని పేరు వినపడుతోంది. కానీ ఇంకా అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. త్వరలోనే ఈ విషయంలో దర్శకుడు అధికారికంగా ఒక వివరణ ఇవ్వనున్నాడు

ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే అనిరుధ్
ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే అనురుధ్ రవిచందర్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అసలైతే ఎన్టీఆర్ తో అనిరుద్ ఇదివరకే ఒక సినిమా చేయాల్సింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అరవింద సమేత కోసం మొదట అతన్ని అనుకున్నారు. కానీ అప్పుడు అనుకోకుండా ఆ కాంబినేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా కోసం అనిరుద్ ఫిక్స్ అయ్యాడు. ఇటీవల కొరటాల ప్రత్యేకంగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

రెమ్యునరేషన్ ఎంతంటే?
అయితే అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అనిరుద్ బిగ్ బడ్జెట్ సినిమాలకు అత్యధికంగా 4 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఐదు నుంచి 6 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











