Music Shop Murthy Collections: షాకింగ్‌గా మ్యూజిక్ షాప్ మూర్తి కలెక్షన్లు!
విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో సీనియర్ నటి ఆమని కలిసి నటించిన చిత్రం కంటెంట్ బేస్డ్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. యువ హీరోయిన్ చాందినీ చౌదరీ, సీనియర్ నటుడు భానుచందర్ తదితరలు నటించిన ఈ చిత్రం జూన్ 14వ తేదీన గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్ల విషయాల్లోకి వెళితే..
మ్యూజిక్ షాపునే నమ్ముకొని జీవితాన్ని కొనసాగించిన మూర్తి అనే వ్యక్తి.. కాలం మారినా, నష్టాలు వచ్చినా అదే షాప్‌ను కొనసాగించడంతో ఆర్థిక సమస్యలకు గురి అవుతాడు. ఆ క్రమంలో కొందరు ఇచ్చిన సలహాతో డీజేగా మారడానికి ప్రయత్నిస్తాడు. మ్యూజిక్ షాప్ మూర్తి..డీజే మూర్తిగా మారడానికి ఆయన పడ్డ కష్టాలు ఏమిటనేది సినిమా కథ. అత్యంత ఎమోషనల్‌గా రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను కంటెంట్‌తోపాటు ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందించారు. యాక్టర్ల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌తో మూవీపై ఫీల్ గుడ్ ఒపినియన్ రావడం.. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వినిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఈ మూవీని సుమారుగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఊహించినంతగా కలెక్షన్లు రాకపోవడం గమనార్హం. అయితే మౌత్ టాక్‌తో పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకు తొలి రోజు ఓ మోస్తారు వసూళ్లను బాక్సాఫీస్ వద్ద సాధించింది. తొలి రోజు ఈ సినిమా 30 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వీకెండ్‌లో కలెక్షన్లు పెరిగితే.. ఈ సినిమాకు ప్లస్ అవతాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











