Muttiah Muralidharan Biopic 800 మూవీ రైట్స్ దక్కించుకొన్న శివలెంక కృష్ణ ప్రసాద్..పాన్ ఇండియా రిలీజ్ ఎప్పుడంటే

సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది క్రీడాకారుల బయోపిక్స్ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్, మేరి కోమ్ లాంటి క్రీడా దిగ్గజాల జీవిత చరిత్రలు తెరరూపం సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్ మైదానంలో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించిన శ్రీలంక బౌలర్, క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ విడుదలకు సిద్దమవుతున్నది.

800 వికెట్లు తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మురళీధరన్ జీవితం ఆధారంగా 800 అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పాన్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ దక్కించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

Muttiah Muralidharans Biopic 800 Pan India Theatrical Rights acquired by Sivalenka Krishna Prasad of Sridevi movies

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను మూవీ ట్రైన్ మోషన్ పిక్చరస్ నిర్మిస్తున్నది. ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మహిమా నంబియార్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. బుకర్ ప్రైజ్ విన్నర్ స్నేహన్ కరుణటిలక రచనా సహకారం అందిస్తున్నారు. 800 మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీలంక, ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా, కొచ్చిన్, చండీగఢ్, చెన్నైలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను శివలెంక కృష్ణ ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నారు. తమిళంలో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ లాంటి క్రీడాకారుడి జీవితాన్ని తెరపైకి తీసుకు రావడం ఛాలెంజింగ్ టాస్క్. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. వాటన్నింటిని ఎదుర్కొని ఈ సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమయ్యారు. 800 వికెట్ల తీసుకొని చరిత్ర సృష్టించినందున్న ఈ సినిమాకు 800 అని టైటిల్ పెట్టడం కరెక్ట్ అనిపించింది. మురళీధరన్ బాల్యం నుంచి లెజెండరీ క్రికెటర్‌గా ఎదిగిన ప్రయాణం వరకు సినిమాలో చూపించబోతున్నాం అని అన్నారు.

Muttiah Muralidharans Biopic 800 Pan India Theatrical Rights acquired by Sivalenka Krishna Prasad of Sridevi movies

గతేడాది నేను యశోద సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసి ఘన విజయాన్ని అందుకొన్నాను. ప్రస్తుతం 800 మూవీని ఇండియా మొత్తం రిలీజ్ చేయడం చాలా గర్వంగా ఉంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సెప్టెంబర్‌లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అని శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

నటీనటులు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్, నాజర్, వెల్ రామ్మూర్తి, రిత్విక, అరుల్ దాస్, హరికృష్ణన్, శరత్ లోహియా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
మ్యూజిక్: జిబ్రాన్
రచన, దర్శకత్వం: ఎంఎస్ శ్రీపతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X